ఆమెకు ఆ హోటల్లో జరిగింది వేరు,మీడియా రాస్తోంది వేరు

తెలుగు అమ్మాయి..కన్నడ సెటిల్డ్..ఇప్పుడిప్పుడే హీరోయిన్ చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే రీసెంట్ గా ఆమె పై కుట్ర పూరితంగా వ్యవహిరిస్తూ నార్త్ మీడియా స్ప్రెడ్ చేసిన ఓ వార్త దావానలంగా ఆమె కెరీర్ నే కబళించే పోగ్రాం పెట్టుకుంది. ఆమెను ఇబ్బందుల్లో పడేస్తోంది. ఈ నేపధ్యంలో అసలు నిజాలేమిటి..ఏం జరిగింది …అంటూ బయిటపెట్టడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ విషయమై ఆమె తల్లి వసంత లక్ష్మి తో మాట్లాడి, అక్కడ లోకల్ మీడియా కు సంభందిచిన కొన్ని వివరాలను తెలుసుకుని ఈ స్టోరీ అందిస్తున్నాం.

వివాద వార్త ఇదే..

సినిమా షూటింగ్ కు అని నాగర్ కోయిల్ వెళ్లిన కేరళ నటి మంజు సవార్కర్ అర్ధరాత్రి హోటల్ సిబ్బందితో గొడవకి దిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని శాంత పరిచారు. ఆమె అరవై వేల రూపాయలు కట్టకుండా వెళ్లిపోతూంటే అడ్డుపడ్డామని హోటల్ సిబ్బంది చెప్పారు.

ఈ విషయం నార్త్ మీడియాలో వచ్చింది. దాంతో మన తెలుగు,కన్నడకు చెందిన యూట్యూబ్ ఛానెల్స్ , వెబ్ ఛానెల్స్ , కొన్ని ఎలక్ట్రానిక్ ఛానెల్స్ ఈ విషయం హైలెట్ చేస్తూ చిత్రమైన హెడ్డింగ్ లతో రాసేసాయి.

అయితే అసలేం జరిగింది

మీడియాలో రాసినట్లుగా ఆమె పేరు మంజు సవార్కర్ కానే కాదు. ఆమె పేరు అక్షత శ్రీధర్. అంటే పేరు కూడా వాళ్లు తెలుసుకోలేదు. ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగే ఓ మళయాళ చిత్రం షూటింగ్ నిమిత్తం నాగర్ కోయిల్ వెళ్ళింది. అక్కడ ఆమెకు ఓ చిన్న హోటల్ లో బస ఇచ్చారు. మొదట కంగారుపడినా లో బడ్జెట్ సినిమా కదా అని లాడ్జిలాంటి ఆ హోటల్ లో ఎడ్జెస్ట్ అయ్యింది. అయితే ఆ గది చాలా ఛండాలంగా ఉంది.

రాత్రి ఆ గదిలోకి వెళ్లిన ఆమె తెల్లారి షూట్ కు వెళ్తూ అదే విషయం హోటల్ స్టాఫ్ కు చెప్పింది. అయితే ఆమె షూట్ నుంచి వచ్చేటప్పటికి కూడా ఆ గది అలాగే ఉంది. చివరకు నిత్యావసరాలైన బ్రష్, పేస్ట్, సబ్బు వంటవి కూడా లేవు. శుభ్రం కూడా చెయ్యలేదు. దాంతో ఇలాగే ఉంచాసారేంటి అని అడిగింది. దానికి వాళ్లు ..నువ్వేమన్నా పెద్ద హీరోయిన్ వా..ఇందిరా గాంధీ మనవరాలివా అంటూ వెటకారం గా అన్నారు.

అంతేకాకుండా యాభై ఐదువేలు బిల్ అయ్యింది అది కట్టి కదులు అన్నారు. దానికి ఆమె కంగారుపడి తనతో పాటు వచ్చిన మిగతా సినిమా స్టాఫ్ ని సంప్రదిస్తే..ఇది మనది కానీ చోటు..వాళ్లతో మనకు గొడవెందుకు అని సర్దచెప్పబోయారు. ఈలోగా హోటల్ వాళ్లు డబ్బు కట్టండి అనటం మొదలెట్టారు. ఆమె పోలీస్ లకు ఫోన్ చేద్దామన్నా…కుదరనివ్వలేదు. బయిటకు వెళ్లనివ్వలేదు. అంతేకాకుండా లోకల్ మీడియాని పిలిచి..సౌత్ నుంచి వచ్చిన ఈ హీరోయిన్ డబ్బు కట్టకుండా వెళ్లిపోతోందంటూ రాంగ్ గా ప్రొజెక్టు చేసారు. దాంతో వాళ్లు దాన్ని చిలవలు పలవలు గా మార్చి ,పెంచి ప్రసారం చేసారు. ఈ లోగా ఎలాగో మొత్తానికి ఆమె పోలీస్ లకు తెలియచెయ్యటం..స్టేషన్ కు వెళ్లి ఆ డబ్బు పే చేసి బయిటపడటం జరిగింది.

నిజానికి సినిమావాళ్లు హోటల్ బుక్ చేసినప్పుడు ఆ మేనేజర్ లేదా నిర్మాత ఆ డబ్బు పే చెయ్యాలి. వాళ్లదే భాధ్యత. కానీ ఆమెకు తర్వాత ఆ డబ్బు ఇచ్చినా స్పాట్ లో వాళ్లెవరూ ఆమె సాయంగా ఉండి ఇష్యూ నుంచి బయిటపడే ప్రయత్నం చేయలేదు. నిర్మాత సైతం తనకు అక్కడ విషయాలేవీ తెలియదని మీడియాతో అన్నారు. ఓ హీరోయిన్ లేదా ఓ ఆర్టిస్ట్ ని వాళ్లు చిన్న వాళ్లా..పెద్ద వాళ్లా అనేది ప్రక్కన పెడితే ..షూటింగ్ కు తీసుకెళ్లినప్పుడు రక్షణ కల్పిస్తూ..వారి బాగోగులు చూడాల్సిన భాధ్యత ఆ సినిమాకు చెందిన నిర్మాతదే.

అలాగే అసలు విషయం తెలియకుండా నార్త్ లో వచ్చిన ఓ వార్తని అనువదించేసి..మన లోకల్ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేయటం, ప్రసారం చేయటం వంటివి చేసేటప్పుడు అసలు ఏం జరిగింది..అని కొద్దిలో కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అసలు నిజాలు బయిటకు వచ్చేవి. చక్కగా తెలుగు మాట్లాడే ఆ అమ్మాయి..ఆమె తల్లిని అడిగినా పూర్తి డిటేల్స్ వచ్చావి. మరెందుకో ఆ పని చేయలేదు. యూట్యూబ్ ఛానెల్స్ సైతం ఛండాలమైన హెడ్డింగ్ లతో ఆ వార్తను ప్రెజెంట్ చేసేసి వ్యూస్ కోసం ప్రయత్నం చేసాయి. ఈ పరిస్దితి మారాలి. గాసిప్స్ రాసినట్లుగా న్యూస్ లు ఆధారం లేకుండా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. ఎందుకంటే అందులో కొందరి కెరీర్స్ , జీవితాలు ముడిపడి ఉంటాయి.

ఇక ఈమె తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాపేరు ‘ఇందులోని పాత్రలన్ని కల్పితాలే’.