సమంత రికమండేషన్ ….అఖిల్ ఓకే

విశాల్, సమంతలు జంటగా నటించిన ‘ఇరుంబు తిరై’ చిత్రం తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్ తో డబ్బింగ్ అయ్యి విడుదలైంది. తమిళనాట ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. అయితే అక్కడ సక్సెస్ అయిన స్దాయిలో ఇక్కడ కాలేదు. అయితే ఈ చిత్ర దర్శకుడు పీయస్‌ మిత్రన్ పై తెలుగు హీరోల దృష్టి పడింది. ఆ హీరోల్లో ఒకడు అఖిల్.

మిగతా వాళ్లు అతనికి ఫోన్ చేసి కథ రెడీ చేయమందాం అనుకునే లోగా అఖిల్ స్పీడు అయ్యి పీయస్‌ మిత్రన్ ని పిలిపించుకుని తనకు స్టోరీ రెడీ చేయమన్నారని టాక్. ఇదంతా జరగటానికి సమంత కీ రోల్ ప్లే చేసిందని చెప్తున్నారు. సమంత ‘అభిమన్యుడు’లో హీరోయిన్ కావటంతో ఇది సాధ్యమైంది. అఖిల్ కు వదిన అయిన సమంత..ఆ దర్శకుడులో మంచి ప్రతిభ ఉందని ప్రమోట్ చేసి ప్రాజెక్టు సెట్ చేస్తోందని వినికిడి. అఖిల్ కు ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కుటుంబం మొత్తం ప్రయత్నాల్లో ఉంది.

ప్రస్తుతం మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న అఖిల్‌ అక్కినేని ఈ సినిమాని ఫైనల్‌ చేసారని సమాచారం. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మిస్టర్ మజ్ను చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఈ తమిళ దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట అఖిల్.

ఇప్పటికే అఖిల్‌కు స్టోరీ లైన్‌ వినిపించిన మిత్రన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్‌. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.