పోస్టర్‌ గొడవ పెద్దదై ఫ్యాన్స్ అరెస్ట్

సోషల్ మీడియాలోనే కాదు..బయిట కూడా కొందరు స్టార్ హీరోల అభిమానులు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే చాలా సందర్బాల్లో చాలా గొడవలు అయ్యాయి. అయితే వాటిల్లో పోలీస్ స్టేషన్ మెట్లు దాకా ఎక్కి, అరెస్ట్లు లు అయ్యినవి తక్కువ. కానీ ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ మాత్రం చిన్న విషాయాన్ని పెద్దది చేసుకున, రచ్చ రచ్చే చేసి, చివరకు అరెస్ట్ లు దాకా తెచ్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే… తమిళ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అజిత్ పోస్టర్లు, కటౌట్స్ ఏర్పాటు చేసిన ఆయన అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో థేని జిల్లాలోని కొడువిలర్పట్ గ్రామంలో అతికించిన ‘విశ్వాసం’ పోస్టర్ ను ఎవరో చింపివేశారు. ‘విశ్వాసం’ పోస్టర్ చింపివేత వివాదాస్పదంగా మారింది.

దీంతో సదరు పోస్టర్‌ను చింపివేసిన చోటుకి దగ్గరలో నివసిస్తున్న జయమణే దీనికి కారణమంటూ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ సందర్భంగా అజిత్ అభిమానులు.. జయమణిని తీవ్ర తిట్టిపోయటమే కాకుండా చంపుతామని బెదిరించారు. దీంతో, స్థానిక పోలీస్ స్టేషన్‌లో జయమణి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అజిత్ అభిమానులు విజయ్, సతీశ్వరన్, సెల్వకుమార్, బాలమురుగన్, అజిత్ కుమార్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.