షూటింగ్ ద‌శ‌లో అడివి సాయికిర‌ణ్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`

శ‌షా చెట్రి(ఎయిర్ టెల్ మోడ‌ల్‌) ,ఆది సాయికుమార్, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్,  మ‌నోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి ర‌వి, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌`. వినాయ‌కుడు టాకీస్ బ్యాన‌ర్‌పై య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ల్పిత కథాంశంతో.. ` వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత` వంటి సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.  ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్ , పద్మనాభ రెడ్డి, గేరి.బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాత‌లు.  ఓ సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఓ సినిమా నిర్మాణంలో  భాగ‌మ‌వ‌డం ఇదే తొలిసారి. అలాగే ఎయిర్టెల్ 4G గర్ల్ గా పాపులర్ అయిన శషా చెట్రి ఈ సినిమా తో తెలుగులో పరిచయం అవుతున్నారు. `బొమ్మరిల్లు, కిక్, ఎవడు, మిస్టర్ పర్ఫెక్ట్, గూఢచారి` లాంటి చిత్రాలకు రచయితగా పని చేసి, కమలహాసన్, మరియు తమిళ్ శంకర్ తో కూడా పనిచేసిన స్టార్ రైటర్ అబ్బూరి రవి గారు ఈ చిత్రానికి రచయితగానే కాకుండా, మొట్ట మొదటి సారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రని ఈ చిత్రంలో పోషిస్తున్నారు. అతడు సినిమాలో యంగ్ మహేష్ బాబు గా , చత్రపతి సినిమాలో యంగ్ ప్రభాస్ గాను, తనదైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ నందం ఈ సినిమా లో ఒక స్టైలిష్ విలన్ గా కనపడతాడు. ఇంకా,  పోకిరి , హ్యాపీడేస్ లాంటి చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి , వినాయకుడు తో హీరో గా అలరించిన క్రిష్ణుడు ఈ చిత్రంలో ఒక విచిత్రమైన కామెడీ పాత్రని పోషిస్తున్నారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ సినిమాకు సాహిత్యాన్ని అందిస్తున్నారు.

 

“సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌ర‌పుకుంటుంది. ఈ చిత్రాన్ని కాశ్మీర్, ఢిల్లీ, లంబసింగి, A.O.B, చింతపల్లి, అరకు, కాకినాడ పోర్ట్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో సినిమా షూటింగ్ చేశాం. ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. జ్ఞాన శేఖర్ గారి దగ్గర సెకెండ్ యూనిట్ కెమరామెన్ గా వేదం ,కృష్ణంవందే జగత్గురుం, కంచే, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి  సినిమాలకి పనిచేసిన జైపాల్ రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా… క్షణం, PSV గరుడవేగ, గూఢచారి సినిమాలకి స్వరాలు సమకూర్చి మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక ఇండిపెండెంట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. అలాగే క్షణం, గూఢచారి సినిమాలకి ఎడిటర్ గా గుర్తింపు తెచ్చుకున్న గేరి.బిహెచ్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసి  కృష్ణార్జునయుద్ధం, రాజా ది గ్రేట్  లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రామక్రిష్ణ మరియు గూఢచారి యాక్షన్ కోరియోగ్రాఫెర్ గా చేసిన సుబ్బు రాబిన్, నాభ కూడా ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. మంచి ఆర్టిస్టుల‌తో పాటు, టెక్నిక‌ల్ టీం కుదిరింది. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాం“ అన్నారు.