స్నేహా ఉల్లాల్ ..హాట్ ఫొటో చూసి ఇండస్ట్రీ షాక్

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా తో హీరోయిన్‌గా పరిచయమయ్యింది స్నేహా ఉల్లాల్‌. ఆ సినిమా తర్వాత ‘నేను మీకు తెలుసా’, ‘సింహా’, ‘అలా… మొదలైంది’, ‘మడత కాజా’, యాక్షన్‌ 3డీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ సుందరాంగి సుందరి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమయ్యారు. దాదాపు మూడు ఏళ్ల తర్వాత ‘ఆయుష్మాన్‌ భవ’ సినిమాతో తెలుగు తెరపై మరోమారు మెరిసింది. కానీ ఆ సినిమా కలిసి రాలేదు.

దాంతో నటిగా ఆఫర్స్ లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా ఫాన్స్‌తో అనుభంథం కొనసాగిస్తోంది.   అభిమానులకు ఆనందం కలిగించేలా.. స్నేహ అడపాదడపా కొన్ని మతి పోగొట్టే ఫోటోలు పెడుతుంటుంది. చిత్రంగా ఈ సినిమా ద్వారా ఆమె ఈ ఫొటోలలో రెచ్చిపోతుంటుంది. వాస్తవానికి స్నేహా ఉల్లాల్‌ సినిమాల్లో బిజీగా వున్న టైమ్‌లో ఇంత హాట్‌గా కనిపించాలని ప్రయత్నం ఏమీ చేయ లేదు.ఇప్పుడు తనను ఎవరూ పట్టించుకోవటం లేదు అనుకుందో ఏమో… ఐడెంటిటీ కోసం ఇలా హాట్ గా అదరకొడ్తోంది.

 


స్నేహా ఉల్లాల్ ఆరోగ్య విషయానికొస్తే.. ఆమె గత కొంతకాలంగా ‘ఆటో ఇమ్యూన్ డిసీజ్‌’తో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వ్యాధి తీవ్రత ఎక్కువైందన్న ప్రచారం కూడా జరిగింది. ఓవైపు తెలుగులో ఓ సినిమాతో ఆమె బిజీగా ఉన్న సమయంలో.. ఇలాంటి వార్తలు రావడం ఆమె సినిమాలకు దూరం అయ్యింది. అయితే ఇప్పుడు ఆమె పరిస్దితి ఏమిటనేది మాత్రం తెలియరాలేదు.