హీరో సాగర్ మరణానికి కారణం అదే: పింగ్ పాంగ్ సూర్య

తపన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు పింగ్ పాంగ్ సూర్య.ఈ సినిమా అనంతరం ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన సై సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే బాహుబలి సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. ఇలా పలు సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రల ద్వారా అందరిని సందడి చేస్తున్నటువంటి పింగ్ పాంగ్ సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూలో భాగంగా సూర్య మాట్లాడుతూ కన్నడ ప్రముఖ ప్రొడ్యూసర్ కుమారుడు యశో సాగర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. యశో సాగర్ ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. స్నేహ ఉల్లాల్, సాగర్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ చూసినా కానీ ఎంతో నవ్వు తెప్పిస్తుంది.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాగర్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలైన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఈ క్రమంలోనే ఈయన గురించి మాట్లాడుతూ సాగర్ నిజ జీవితంలో ఎంతో మంచి వ్యక్తి ఎప్పుడూ అందరితో సరదాగా నవ్వుతూ ఉండేవారు. ఏ ఒక్కరితో కూడా ఎలాంటి వివాదాలు పెట్టుకునే వారు కాదు. అందరితో ఎంతో సరదాగా మాట్లాడే సాగర్ కు ఏ విధమైనటువంటి చెడు అలవాట్లు లేవు.అయితే ఆరోజు ఈయన కారులో చాలా వేగంగా ప్రయాణించడం వల్లే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని ఈ ప్రమాదం కారణంగానే సాగర్ మరణించాడని ఈ సందర్భంగా సాగర్ మరణం గురించి సూర్య షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.