బాలయ్య ‘సింహా’ ని వదిలేటట్లు లేడుగా

బాలయ్య కొత్త చిత్రంలో ‘సింహా’ టచ్

బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం సింహా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. దాంతో ఆ తర్వాత వచ్చిన బాలయ్య సినిమాల్లో కూడా ఆ అంశాలు రిపీట్ చేయటానికి ప్రయత్నించారు. ఇప్పుడు మరోసారి ఆ ఫీట్ ని బాలయ్య చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో బాలయ్య సింహా ప్యాట్రన్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 105వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. బాలకృష్ణ తదితరులపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అన్బు – అరివు కంపోజ్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట. ఈ ఎపిసోడ్ …యజ్ఞం బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ చూసిన వారికి ఖచ్చితంగా సింహా చిత్రం గుర్తుకు వస్తుందంటున్నారు.

బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ – వేదిక హీరోయిన్స్. ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. భూమిక కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముందు సంక్రాంతికి అనుకున్నా కూడా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం విడుదల కానుంది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.