హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్ అంటూ ర‌కుల్ ప్రీత్ సింగ్ ట్వీట్

తెలంగాణ రాష్ర్ట మంత్రి, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామార‌వు( కేటీఆర్) పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, ఫాలోవ‌ర్స్ కేటీఆర్ ని విష్ చేసారు. అలాగే పార్టీలో కీల‌క వ్య‌క్తులు, కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితులు కూడా త‌మ‌దైన శైలిలో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక టాలీవుడ్ నుంచి ప‌లువురు ప్ర‌ముఖులు కేటీఆర్ కి సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ర‌కుల్ ప్ర‌త్ సింగ్ కూడా ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. హ్యాపీ బ‌ర్త్ డే కేటీఆర్. ఈ సంవ‌త్స‌ర‌మంతా మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి.

మ‌న రాష్ర్టాన్ని మ‌రింత అభివృద్ధి చేయ‌డానికి కావాల్సినంత బ‌లం, సామ‌ర్ధ్యం మీకు చేకూర‌ల‌ని కోరుకుంటున్నా. దూర దృష్టి ఉన్న నాయ‌కుడు. మీరు ఇలాగే ముందుకు సాగాలి అంటూ ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్- కేటీఆర్ ఫోటో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. కేటీఆర్ కి టాలీవుడ్ ఇండ‌స్ర్టీ నుంచి మంచి స్నేహితులు ఉన్నారు. న‌టులు రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ కేటీఆర్ కి మంచి స్నేహితులు. ఎన్నోసార్లు ఆ హీరోలిద్ద‌రి సినిమా వేడుక‌ల‌కు అతిధిగాను విచ్చేసారు. ఇంకా ప‌లువురు హీరోల‌తో, నిర్మాత‌ల‌తో, ద‌ర్శ‌కుల‌తో కేటీఆర్ కు మంచి సంబ‌ధాలున్నాయి. వాళ్లంతా కూడా కేటీఆర్ ని విష్ చేసారు.

అయితే న‌టీమ‌ణుల్లో ర‌కుల్ విషెస్ ఇంప్రెసివ్ గా ఉంది. కేటీఆర్ గురించి అంద‌రిక‌న్నా నాలుగు మాట‌లు ఎక్కువ‌గానే చెప్పింది. అలా ఆ విషెస్ లో ప్ర‌త్యేక‌త క‌నిపించింది. ఇక ర‌కుల్ న‌టిగా కొన‌సాగుతూనే హైద‌రాబాద్ లో ఖ‌రీదైన సెంట‌ర్ల‌లో ఫిట్ నెస్ జిమ్ములు నిర్వ‌హిస్తోంది. వాటిని ర‌కుల్ త‌మ్ముడు చూసుకుంటున్నాడు. అద‌నంగా ఆ జిమ్ముల నుంచి భారీగానే లాభాలు ఆర్జిస్తోంది. న‌టిగా పారితోషికం…హైద‌రాబాద్ లో వ్యాపారం…సొంత ఇళ్లు వంటివి ర‌కుల్ క‌ల్గి ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ్ముడ్ని టాలీవుడ్ లో హీరోగా కూడా లాంచ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.