కొన్ని నెలల క్రితం దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఎంత సంచలనమైందో తెలిసిందే. సినిమా రంగం నుంచి మొదలైన ఈ ఉద్యమం అన్ని రంగాలను ఓ కుదుపు కుదిపేసింది. ధైర్యంగా ముందుకొచ్చి పలువురు నటీమణులు తమకు జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేసారు. ఇక లైంగిక దాడుల్లో భాగంగా కఠిన శిక్షలు అమలు చేస్తున్నా దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలను చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దర్శకుడు, కేరళ రాష్ట్ర చలన చిత్ర అకాడమీ చైర్మన్ కమల్ పై ఓ నటి లైంగిక ఆరోపణలు చేసింది. ప్రణయ మీనుకడలు కాదల్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి…దానికి ప్రతికగా కోరిక తీర్చమని కోరినట్లు సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మంజు వారియర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అమి సినిమా షూటింగ్ సమయంలో ఇదంతా జరిగిందన్నారు. ఆ తర్వాత 2019 లో లీగల్ నోటీసులు పంపిచినట్లు చెప్పారు. అమి సినిమా షూటింగ్ సమయంలో వేధించాడు. తన ప్లాట్ కి ఒంటరిగా వెళ్లడంతో అత్యంత పాశవికంగా మృగంలా ప్రవర్తించాడని ఆరోపించింది. కమల్ అతడిపై ఉన్న నమ్మకాన్నిపోగొట్టుకున్నాడు. ఆయన ఓ తోడేలు లాంటివాడు. గతంలోనూ ఆయన సొంత ఇంట్లోను పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. అయితే ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఈ విషయాన్ని ఆ నటి ఇప్పుడే ఎందుకు బయటకు తెచ్చిందన్నది ఆసక్తికరంగా మారింది.
కొంత మంది చిన్న స్థాయి సెలబ్రిటీలు ప్రచారం కోసం గతంలో ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. తాజా ఆరోపణపై కూడా పోలీసులు అలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కమల్ స్పందించాడు. ఆమెవి ఆధారాల లేని ఆరోపణలు. గత ఏడాది నోటీసు వచ్చిన మాట వాస్తవమే. దీనిపై న్యాయవాధిని సంప్రదించా. అవన్నీ తప్పుడు ఆరోపణలని తెలిసి చట్టబద్దంగా వెళ్దామని వదిలేసా. సమాజంలో నాకున్న పేరు ప్రతిష్టలను బజారుకు ఈడ్చాలనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు దాచి పెట్టి ఇప్పుడే ఎందుకు బయట పెట్టిందో? చెబితే బాగుంటుందని చురకలు వేసారు.