తప్పు జరిగింది.. శివ పార్వతి వీడియోపై ప్రభాకర్ కామెంట్స్

Actor Prabhakar About Shiva Parvathi Video

కరోనా వైరస్ మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది. కరోనా వచ్చినా, వైరస్ వల్ల మరణించినా సొంత వాళ్లు కూడా శవాలను ముట్టడం లేదు. కరోనా వైరస్ వల్ల మరణించిన వారి దుస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్ వస్తే పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోంది. ఈ క్రమంలో తెలుగు చిత్ర సీమలో కరోనా తాండవం చేస్తోంది. నటి శివ పార్వతికి కరోనా రావడం, కోలుకుని ఇంటికి తిరిగి రావడం అందరికీ తెలిసిందే. కరోనా సమయంలో తననెవరూ పట్టించుకోలేదని, బాగోగులు కూడా ఎవ్వరూ అడగలేదని, ముఖ్యంగా నటుడు ప్రభాకర్‌పై ఆరోపణలు చేసింది.

Shiva Parvathi

శివ పార్వతీ చేసిన ఆరోపణలు, ఆ వీడియోపై ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం అండి.. నిన్న శివ పార్వతమ్మ గారు ఓ వీడియోను రిలీజ్ చేశారు. దానిపై స్పందించమని నన్ను అభిమానించేవాళ్లు.. అది నిజమని నమ్మేవాళ్లు.. ఏం జరిగిందో తెలుసుకుందామనుకునే మీడియా వాళ్లు.. చాలా మంది అడుగుతున్నారు. సో.. ఇంత మంది శ్రేయోభిలాషులు అడుగుతున్నా దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే.. ఇన్ని రోజుల తరువాత అమ్మను చూడటం ఆ వీడియోలోనే. ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్‌లు గానీ, నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు. వాళ్ల అబ్బాయి మాట్లాడాడు. ఆ విషయాలు అమ్మకి తెలియవు.. అందుకే వీడియోలో అలా మాట్లాడారు.

Actor Prabhakar About Shiva Parvathi Video

అయినా నేను అమ్మ కోలుకున్నాకే మాట్లాడుదాం అనుకున్నాను. అయితే ఇందాకే అమ్మ ఫోన్ చేసింది. ‘సారీ బాబు విషయం తెలియక మిస్ అండర్ స్టాండింగ్ వల్ల తప్పు జరిగింది. నేను యూట్యూబ్‌లో పెట్టలేదు.. నాకు అసలు వాటి గురించి తెలియదు.. నేను మన వదినమ్మ గ్రూప్‌లోనే పెట్టాను..అది ఎలా వెళ్లిందో నాకు తెలియదు.. అసలేం జరిగిందో ఇంకోవీడియోను పెడతానని అంది. అమ్మ ఈ వీడియోలు పెట్టడం వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం. ఇండస్ట్రీలో ఎవరికి ఏం జరిగినా అండగా ఉంటాం. సాయం చేస్తాం. శివ పార్వత్మకు కరోనా వచ్చిన దగ్గరి నుంచి ఈ రోజు వరకు ఆమెకు సాయం చేసిన శివ బాలాజీ, జీవిత రాజశేఖర్ వంటి వారికి థ్యాంక్స్.. ఈ విషయంపై నేను, అమ్మ మళ్లీ క్లారిటీ ఇస్తాం. ముందుగా అమ్మ కోలుకోవాల’ని కోరుకున్నాడు.