యాటిట్యూడ్ స్టార్ మరో కొత్త సినిమా.. టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్!

డైరెక్టర్ సంపత్ రుద్ర డైరెక్షన్లో టీవీ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం బరాబర్ ప్రేమిస్తా. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ మహి ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేశారు. లవ్,యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంది. తెలంగాణలోని రుద్రారం అనే ఊరి నేపథ్యంగా ఆసక్తికరంగా కథా కథనాలు ఉన్నాయి.

పరస్పరం గొడవలు పడే ఊరిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. నువ్వు నన్ను కొడతా అంటే నొప్పి నీ కళ్ళలో తెలుస్తుంది ఏంట్రా అని చంద్రహాస్ చెప్పే డైలాగ్ హైలెట్గా నిలుస్తుంది. హీరో చంద్రహాస్ ప్రతినాయకుడు అర్జున్ మహి మధ్య టగ్ టగ్ ఆఫ్ వార్ ఆకట్టుకుంది. హీరోయిన్ మేఘన పెర్ఫామెన్స్ కూడా ఎనర్జిటిక్ గా అనిపించింది.

యాటిట్యూడ్ స్టార్ గా పేరుగాంచిన చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ నేను నా నెక్స్ట్ మూవీ ఎలా ఉండాలనుకున్నానో అలాంటి సినిమా తో మీ ముందుకి వస్తున్నాను. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ వీ వీ వినాయక్ గారికి థాంక్స్ చెప్తున్నాను.మా టీజర్ తప్పకుండా వైరల్ అవుతుంది. సినిమాకి ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఈ సినిమాకి మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో హీరో ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి నా ధన్యవాదాలు అని చెప్పాడు.

ఇక విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న యాక్టర్ అర్జున్ మహి మాట్లాడుతూ 2018లో ఇష్టంగా సినిమాతో మీ ముందుకు వచ్చాను, డైరెక్టర్ సంపత్ ఆ సినిమా తీశారు ఇప్పుడు అదే దర్శక నిర్మాతలు తీస్తున్న ఈ సినిమాలో నటించాను. చిన్నచిత్రంగా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారింది అని చెప్పాడు. ఇక ఈ సినిమాని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సినీ క్రియేషన్స్ ఏవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్ల పై గెడ చందు, గాయత్రి చిన్ని, కె.వి.ఆర్ నిర్మిస్తున్నారు.

Barabar Premistha Movie Teaser 4K | Chandra Hass | Megna Mukharjee | Arjun Mahi | Sampath Rudra