పబ్లిసిటీ కోసం మరీ ఇలానా?.. గీతామాధురి భర్త రచ్చ రచ్చ!!

Actor Nandu Post About BB

సింగర్ గీతా మాధురి భర్త నందు గురించి అందరికీ పరిచయమే. ఒకవేళ అలా గుర్తుకు రాకపోతే.. 100% లవ్ అజిత్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. ఆ నందు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో నందు పాల్గొనబోతోన్నాడని మొదటి నుంచి లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఆ రూమర్స్‌ను, లీకులను వాడుకోవాలని నందు బాగానే ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే నందు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

Bigg Boss 4 Telugu
Bigg Boss 4 Telugu

నందు ఆగస్ట్ 23న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. బాసు రేపు బిగ్( BIGG) అనౌన్స్మెంట్.. ఎంతో ఆత్రుతగా ఉంది అంటూ పోస్ట్ చేశాడు. దాంట్లో బిగ్ అనే అక్షరాలు ఉండటం అది బిగ్ బాస్‌ కు సంబంధించిన ప్రకటన అయి ఉంటుందని అంతా అనుకున్నారు. దీనికి తగ్గట్టే నందు నిన్న డార్లింగ్స్ నేను BBలో ఉన్నాను.. BBలో మన రచ్చ మామూలుగా ఉండదు.. ఎంతో వినోదాన్ని పంచడానికి మీ ముందుకు వస్తున్నాను.. మీ మద్దతు మరింత కావాలి.. రేపు (ఆగస్ట్ 25) సాయంత్రం ఆరుగంటలకు ఇంకో అప్డేట్ రెడీగా ఉంది.. చూస్తూనే ఉండండి అని మరో పోస్ట్ పెట్టాడు.

ఆ బిగ్, ఈ బీబీ అనే పదాలతో అందరూ బిగ్ బాస్ ప్రకటన అయి ఉంటుందని అనుకుంటున్నారు. అయితే అందులో మాత్రం ఓ చిన్న పబ్లిసిటీ స్టంట్ ఉంది. బీబీ అంటే బిగ్ బాస్ కానేకాదు. అలా అయ్యే చాన్స్ ఉండదు. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం ఇలా ముందుగా కంటెస్టెంట్లు బహిరంగంగా ప్రకటించడం విరుద్దం. అయితే మరి ఆ బీబీ అంటే ఏంటి? అనే కొత్త సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. అయితే బీబీ అంటే తన కొత్త ప్రాజెక్ట్ పేరు. బీబీకి మీనింగ్ బ్లాక్ బస్టర్ లేదా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే అర్థం ఉండొచ్చు. అయితే సినిమా టైటిల్ ఏమై ఉంటుందా? అనేది కచ్చితంగా తెలియాలంటే నేటి సాయంత్రం ఆరు గంటల వరకు వేచి ఉండాల్సిందే.