ఫేక్ అకౌంట్ తో మోసం చేస్తున్న గీతా మాధురి.. విషయం ఏమిటంటే..?

టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ ప్లే బ్యాక్ సింగర్ గీత మాధురి గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గీతా ఎక్కువగా మాస్ నంబర్స్ లో పాటలు పాడింది. ఇటీవల ఆచార్య సినిమాలో గీతామాధురి పడిన చాలా కష్టం వచ్చిందే చింతామణి అనే పాటకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గీతామాధురి నటుడు నందుని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. వివాహం తర్వాత వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే గీతామాధురి గురించి గతంలో చాలా రూమర్లు చక్కర్లు కొట్టాయి. గీతామాధురి తన భర్త నుండి విడిపోనుందని రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్స్ గురించి గీతామాధురి, నందు క్లారిటీ ఇచ్చారు. వారి మధ్య ఎటువంటి గొడవలు లేవని, వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నామని వారి విడాకుల గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఇద్దరు కలసి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడింది. అయితే తాజాగా మరొకసారి గీతామాధురి మరొక సమస్యలో చిక్కుకుంది.

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వల్ల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లు మీద అనేక ఫేక్ అకౌంట్ లో కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ద్వారా సెలబ్రిటీలు చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా గీతా మాధురి కూడా అటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా గీత మాధురి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. గీతా మాధురి పేరు, ప్రొఫైల్ ఫోటోతో యూఎస్ నంబర్ నుంచి ఎవరో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారని, వాళ్ళు తన పేరు వాడుకుంటూ ఇతర సెలెబ్రిటీల ఫోన్ నంబర్స్ అడుగుతున్నారని గీత తెలియచేసింది. . అయితే అది ఫేక్ అకౌంట్ అని దయచేసి ఎవరు అలా మోసపోయి వారు అడిగిన వివరాలు షేర్ చేయకండి అంటూ గీత హెచ్చరించింది.