దిల్లీ నిర్భయ ఘటన ఎంతటి సంచలనమైందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలంతా చర్చించుకున్న అమానుష ఇది. ఒక రన్నింగ్ బస్ లో నిర్భయ అత్యాచారం అటుపై ఆకతాయిల వికృత చేష్టలను కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇలాంటి రేప్ ఘటన దేశంలో అంతకుముందు లేదని పోలీస్ రికార్డులకెక్కింది. ఈ ఘటనపై న్యాయవిచారణలో ఎన్నో మతలబులు.. రాజకీయ నాయకుల జోక్యం.. కోర్టుల చుట్టూ తిరిగిన సన్నివేశం వగైరా వగైరా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. రేప్ అనంతరం సింగపూర్ వంటి చోట ట్రీట్ మెంట్ కొనసాగిన బాధిత యువతి (విద్యార్థి) మరణించింది. అనంతరం దిల్లీలో ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని అల్లర్లు జరిగాయి.
2012 డిసెంబర్ 16న ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 29న బాధిత యువతి మరణించింది. అత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పోలీసుల విచారణ.. బాధితురాలి కుటుంబంలో ఆవేదన.. ప్రజల్లో వెల్లువెత్తిన తీవ్ర నిరసనలు ఉద్రిక్త వాతావరణం.. ఇదంతా ఒక సినిమానే తలపిస్తుంది. ఈ ఘటనలో దోషుల్ని దుర్మార్గుల్ని ఇటీవలే ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఉరి తీతకు ముందు కోర్టులు- లా అంటూ సాగిన డ్రామా గురించి తెలిసిందే. అయితే ఇలాంటి ఓ ఛాలెంజింగ్ సబ్జెక్టుతో వెబ్ సిరీస్ ని నిర్మించింది నెట్ ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో దిల్లీ క్రైమ్ పేరుతో టెలీకాస్ట్ అవుతోంది. సిరీస్ కాస్త స్లోగా ఉన్నా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది.