ముసలమ్మలా ఉన్నావు.. అనసూయ లేటెస్ట్ ఫోటోల పై నేటిజన్స్ కామెంట్?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఒకవైపు వెండితెర అవకాశాలతోనూ అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ విధంగా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్న అనసూయ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై ఈమె వరుస సినిమా షూటింగులతో అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె ఎన్ని సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను సందడి చేస్తున్నారు.అయితే ఈమె వస్త్రధారణ కారణంగా పలుసార్లు విమర్శలను ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వాటన్నింటిని తను ఏమాత్రం లెక్క చేయకుండా తన ధోరణిలో దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే అనసూయ ఏకంగా సిల్వర్ రంగు చీర ధరించి దేవకన్యల మెరిసిపోతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అనసూయ క్యూట్ ఫోటోలపై పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఈ చీరలో ముసలమ్మలా ఉన్నావు అంటూ తన ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ తన గ్లామరస్ ఫోటోలతో ఇలా ఎన్నోసార్లు విమర్శలు ఎదుర్కొందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉండగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.