ప్చ్‌! నిర్మాత జేబులు అలా గుల్ల చేశారు!!

వెంకీమామ క‌శ్మీర్ ఎపిసోడ్స్ 8 కోట్లు వృథా!

విక్ట‌రీ వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `వెంకీ మామ` గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో రిలీజై యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించింది. అయితే ఏడాది పాటు ఎంతో సాగ‌దీసి తెర‌కెక్కించిన ఈ సినిమా క్రిటిక్స్ ని మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. ఇక ఇందులో క‌శ్మీర్ ఎపిసోడ్స్ కానీ.. ల్యాగ్ గురించి క్రిటిక్స్ స‌మీక్ష‌ల్లో తీవ్రంగానే విమ‌ర్శించారు.

తాజాగా క‌శ్మీర్ ఎపిసోడ్స్ రూప‌క‌ల్ప‌న‌పై ఇంత‌వ‌ర‌కూ బ‌య‌టికి తెలీని ఆస‌క్తిక‌ర విష‌యం లీకైంది. వాస్త‌వానికి ఆ సినిమాలో క‌శ్మీర్ నేప‌థ్యం అన్న‌దే లేదు. అయినా క‌థ‌లో దానిని బ‌ల‌వంతంగా ఇరికించారు. నాగ‌చైత‌న్య పాత్ర‌ను ఎన్ లార్జ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కానీ క‌శ్మీర్ నేప‌థ్యం వ‌ల్ల క‌లిసొచ్చిందేమీ లేదు. విజువ‌ల్ గ్రాండియారిటీ పేరుతో అద‌నంగా 8 కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ట‌. దానివ‌ల్ల నిర్మాత విశ్వ‌ జేబు గుల్ల అయ్యింది. క‌శ్మీర్ ఎపిసోడ్స్ పై బాబి- డి.సురేష్ బాబు ఇన్ పుట్ ఏమాత్రం వ‌ర్క‌వుట్ కాలేదు.

నిజానికి టాలీవుడ్ బ‌డ్జెట్లు ఇలాంటి వాటి వ‌ల్ల‌నే పెరుగుతున్నాయి. క‌థ‌లో కొన్ని అవ‌స‌రం లేని వాటి వ‌ల్ల‌నే కాస్ట్ ఫెయిల్యూర్ ఎదుర‌వుతోంద‌ని.. స్క్రిప్టులో మార్పుల వ‌ల్ల ప‌ర్య‌వ‌సానాలు తీవ్రంగా ఉంటున్నాయ‌ని చాలా కాలంగా విమ‌ర్శ‌లున్నాయి. ప్ర‌స్తుత క‌రోనా క్రైసిస్ లో బ‌డ్జెట్ల కుదింపుపై ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టి సీన్ లో అయితే వెంకీ మామ క‌శ్మీర్ సీన్స్ క‌ట్ అయ్యి ఉండేవని ఓ సినీప్ర‌ముఖుడు విశ్లేషించారు. నిర్మాత‌ల జేబులు గుల్ల చేసే సీన్లు కాదు.. కంటెంట్ ఆధారిత సినిమాల‌కు ఈ క్రైసిస్ వేళ ఆస్కారం పెరుగుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేయ‌డం కొస‌మెరుపు.