మన సీనియర్ హీరోలు చాలామంది రీమేక్ సినిమాలనే నమ్ముకుంటున్నారు. మంచి కథలు రావట్లేదు, వచ్చినా దర్శకుల మీద నమ్మకం లేకనో ఏమో కానీ సీనియర్ స్టార్లు పర భాషల్లో విజయం సాధిస్తున్న సినిమాల మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం, లూసిఫర్’ సినిమాల్ని రీంక్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన ‘వకీల్ సాబ్’ కూడ రీమేక్ సినిమానే. వీళ్లందరినీ మించి విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు.
గతంలో ‘దృశ్యం’ చేసిన ఆయన తాజాగా ‘దృశ్యం-2’ కూడ చేసేశారు. దీనికంటే ముందే తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులోకి ‘నారప్ప’గా రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. ఈలోపుగానే ఆయన కన్ను ఇంకొక సినిమా మీద పడినట్టు తెలుస్తోంది. మలయాళంలో మంచి హిట్ సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రాన్ని కూడ రీమేక్ చేయాలని వెంకీ భావిస్తున్నారట. త్వరలోనే దర్శకుడ్ని ఫైనల్ చేసుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారట. మొత్తానికి వెంకీ స్ట్రయిట్ సినిమాలు తక్కువగా రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు.