Raashi Khanna : షాకింగ్ : సౌతిండియా సినిమాపై హీరోయిన్ రాశీ ఖన్నా వివాదాస్పద మాటలు.!

Raashi Khanna :  టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది స్టార్ హీరోస్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ చాలా మందికి రాదు కానీ అలా వచ్చిన వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు అయితే అలాంటి తక్కువ మంది స్టార్ హీరోయిన్స్ లో గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా కూడా ఒకరు.

అయితే టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన స్టార్టింగ్ కాస్త బొద్దుగా ఉన్నా ఆ టైం లో మంచి గ్లామ్ షో తో అదరగొట్టిన ఈమె ఆనతి కాలంలోనే మంచి ఫేమ్ ని తెచ్చుకుంది. అయితే రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ సక్సెస్ కావడంతో సౌతిండియా సినిమాపై పలు వివాదాస్పద కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేసింది.

ఇక్కడ హీరోయిన్స్ కి గుర్తింపు ఉండదని హీరోస్ తో కేవలం అప్పుడప్పుడు చూపించే రోల్స్ మాత్రమే ఇస్తారని కేవలం గ్లామర్ కోసమే సినిమాల్లో హీరోయిన్స్ ని తీసుకుంటారని తెలిపింది. అలాగే కొంచెం తెల్లగా ఉంటే ఎవరినైనా మిల్కీ హీరోయిన్ అనేస్తారని సరైన పాత్రలే హీరోయిన్స్ కి ఇవ్వరని షాకింగ్ కామెంట్స్ ఈమె చేసింది.

అయితే ఇదంతా ఆమె నటనకి సరైన పాత్రలు ఇవ్వడం లేదని వాపోతున్నట్టు అనిపించినా ఈ రేంజ్ కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదని చెప్పాలి. మరి దీనిపై సౌత్ ఇండియా సినిమాస్ నుంచి ఆమెకి ఎలాంటి రిప్లై వస్తుందోకూడా ఆసక్తిగా మారింది. అయితే ఇదంతా ఈమె బాలీవుడ్ మీడియాలో చెప్పడం జరిగింది.