లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషన్ గా నిలిచిన బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సినిమా అనుకున్న డేట్ నుంచి ఇప్పుడు వాయిదా పడింది.
కాగా ఈ చిత్రం అయితే ఎట్టకేలకి ఈ డిసెంబర్ 22న వస్తున్నట్టుగా బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అందించారు. ఐతే ఇది వరకు ఉన్న డేట్ సెప్టెంబర్ 22 ని అయితే మేకర్స్ తప్పించగా ఈ డేట్ కే ఎన్నో భారీ మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే.
అలా చాలా సినిమాలు మారగా ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త డేట్ తో మళ్ళీ టాలీవుడ్ లో డేట్ లు కొన్ని చిత్రాలు మార్చుకోనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా మొదటగా అయితే ఈ డేట్ లో ఆల్రెడీ ఉన్న చిత్రాల్లో మొదట నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం “హాయ్ నాన్న” తప్పుకోనుందట.
అలాగే ఈ చిత్రం కాస్త ముందుకే వస్తుంది అని అంటున్నారు. అంటే డిసెంబర్ మొదటి వారంలో అయితే థియేటర్స్ లో రావచ్చని తెలుస్తుంది. కాగా ఈ సినిమా కాకుండా అయితే అదే సమయానికి ఫిక్స్ అయ్యి ఉన్న చిత్రం వెంకీ మామ నటించిన భారీ చిత్రం “సైంధవ్”.
ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 22 కే ఫిక్స్ చేయగా ఈ డేట్ నుంచి ఇప్పుడు వెంకీ మామ తప్పుకోనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వెంకీ మామ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసుకోవాలని చూస్తున్నాడట. దీంతో సలార్ దెబ్బకి మాత్రం ఈ రెండు సినిమాలు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్లిపోయాయి అని చెప్పాలి.