7/జి బ్యూటీ సోనియా రెండో పెళ్లి కలకలం
`7/జి బృందావన కాలనీ` చిత్రంతో తెలుగు యువత కంటికి కునుకు పట్టనీకుండా చేసింది సోనియా అగర్వాల్. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ధనుష్ కథానాయకుడిగా నటించారు. అంతకుముందు 2002 లో వచ్చిన కదల్ కొండెయిన్ చిత్రంతో సోనియా తమిళ పరిశ్రమకు పరిచయమైంది. ఇక 7/ జీ మూవీ సక్సెస్ ఆ ముగ్గురి కెరీర్ ని అమాంతం మార్చేసింది.
అప్పటికే సోనియా దళపతి విజయ్ సరసన `మధర` అనే చిత్రంలో నటించింది. పుత్తుపేటై తిరుటు పాయలే చిత్రాల్లో నటించింది. వరుసగా సెల్వ రాఘవన్ తెరకెక్కించిన చిత్రాల్లో నటించిన సోనియా అతడి ప్రేమలో పడింది. ఈ జంట 2006 లో వివాహం చేసుకున్నారు. కానీ నాలుగు సంవత్సరాలు కాపురం అనంతరం ఆ జంట గొడవపడి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సెల్వ రాఘవన్.. గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
విడాకులు తీసుకున్న పది సంవత్సరాల తరువాత సోనియా తాజాగా షేర్ చేసిన ఓ పెళ్లి ఫోటో సంచలనంగా మారింది. “ఇదేమిటో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి ఉండండి“ అన్న వ్యాఖ్యను ఆ ఫోటోకి జోడించడంతో అందరిలో ఒకటే సందేహం. ఇదేమైనా తన వివాహ ప్రకటనా లేక ఏదైనా సినిమా లేదా సిరీస్ కి సంబంధించిన ప్రమోషనా? అన్నది కన్ఫ్యూజన్ గా మారింది. కొద్దిరోజులు ఆగితే తెలుస్తుందేమో!!