Niharika: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారు అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో భర్తలు చనిపోయిన వారు లేదా విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటివారు తమ రెండో పెళ్లి గురించి ప్రకటనలు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. మరి కొంతమంది రెండో పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి కోవకు చెందిన వారి మెగా డాక్టర్ నిహారిక ఒకరు.
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన నిహారిక అనంతరం పలు సినిమాలలో హీరోయిన్గా నటించారు అయితే హీరోయిన్గా ఈమె సక్సెస్ అందుకోకపోవడంతో తన కుటుంబ సభ్యులు చూపించిన జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే రెండు సంవత్సరాలకి వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో తన దృష్టి మొత్తం సినిమాల పైన పెట్టారు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే ఈమె పలు సినిమాలకు నిర్మాతగా మారి బిజీగా ఉన్నారు ఇటీవల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమాకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ప్రస్తుతం ఈమె తన తదుపరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం కావడంతో చక్కగా చీర కట్టుకొని పెళ్లికూతురుల ముస్తాబయి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
ఇలా ఈమె చీర కట్టుకొని పెళ్లి కూతురు లాగ ముస్తాబు కావడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు నిహారిక రెండో పెళ్లికి సిద్ధమవుతుందా అందుకే ఇలా హింట్ ఇస్తోందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నిహారిక తండ్రి నాగబాబు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక ఎలాంటి అబ్బాయిని ఎంపిక చేసుకున్న తనతో పెళ్లి చేస్తామంటూ తెలియజేశారు. మరి రెండో పెళ్లి పై నిహారిక స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
