Samantha: సినీనటి సమంత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సింగిల్ గా ఉంటున్నారు కానీ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా తనతో పాటు డైరెక్టర్ రాజ్ కూడా వెంటే ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా సమంత ఎక్కడికి వెళ్లినా డైరెక్టర్ రాజ్ కూడా అక్కడే కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.
ఇకపోతే సమంత హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇలా తన నిర్మాణ సంస్థలో ప్రేక్షకుల ముందుకు శుభం అనే సినిమా వచ్చింది అయితే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు అన్నీ కూడా రాజ్ దగ్గర ఉండి చేసుకున్నారు.వారిద్దరి కలిసి ఆ సినిమాను సక్సెస్‌గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ చేశారు. టీమ్ అందరితో కలిసి తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకొన్నారు. ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించడంతో వీరి డేటింగ్ రూమర్లకు మరింత బలం చేకూరింది.
ఇకపోతే తాజాగా సమంత వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రాజ్ నిడిమోరుతో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. దాంతో వాళ్లిద్దరి అఫైర్ గురించి ఫుల్లుగా క్లారిటీ వచ్చేసింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇలా డైరెక్టర్ భుజంపై ఈమె తల వాలుస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడంతో వీరి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారని స్పష్టమవుతుంది అదే తరుణంలో వీరిద్దరూ శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేయడంతో వీరి పెళ్లికి కూడా కుటుంబ సభ్యులు అనుమతి తెలిపారని తెలుస్తుంది.