Renu Desai: నాకు జీవిత భాగస్వామి కావాలి… రెండో పెళ్లిపై పవన్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్!

Renu Desai: సినీ నటి రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ సర్వీస్ చేస్తూ కూడా ఈమె బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నారు కానీ ఇటీవల తిరిగి సినిమాలలో నటిస్తున్నారు.

ఇక ఈమె సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఈ సమాజంలో జరుగుతున్న పలు అంశాల గురించి స్పందిస్తూ ఉంటారు. ఇటీవల హైదరాబాద్ హెచ్సీయూ యూనివర్సిటీ గురించి కూడా స్పందించారు. ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను రెండో పెళ్లి చేసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను కానీ పిల్లల గురించి ఆలోచించి వెనక్కి తగ్గానని వెల్లడించారు. నా వ్యక్తిగతంగా నా జీవితాన్ని చూసుకుంటే నాకు ఒక జీవిత భాగస్వామి కావాలి అనిపిస్తుంది.నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండాలి.. నాకు పెళ్లి కావాలి.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది. కానీ పిల్లల కోణం నుంచి చూస్తే మాత్రం ఇది సాధ్యం కాదు.

నా పిల్లలకు నేను సింగిల్ పేరెంట్.నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని గుర్తు చేసుకున్నారు. నాకు పిల్లలకు మధ్య మరొక వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని రేణు దేశాయ్ తెలిపింది.ఇలా పిల్లల కోసమే తాను రెండో పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.