Samantha: అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత.. సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా?

Samantha: ఇటీవల కాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినపడుతోంది. ఇలా సమంత తరచూ వార్తలలో నిలవడానికి కారణం లేకపోలేదు. సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగానే గడుపుతున్నారు.  అయితే ఇటీవల ఈమె పెద్ద ఎత్తున డైరెక్టర్ రాజ్ నిడుమోరితో కలిసి జంటగా కనబడుతున్నారు. ఇటీవల సమంత ఎక్కడికి వెళ్లిన రాజ్ తో కలిసి జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఇక సమంత రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని సైలెంట్ గా రెండో పెళ్లి పనులు కూడా ప్రారంభించింది అంటూ గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు మారుమోగుతున్నాయి. ఇకపోతే ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా సమంత సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చారు అయితే ఇకపై సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారని సమాచారం. ఈమె డైరెక్టర్ రాజ్ ను  వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అవుతారని వార్తలు వినపడుతున్నాయి అంతేకాకుండా వివాహం తర్వాత సమంత విదేశాలలో స్థిరపడబోతున్నారని తెలుస్తోంది.

ఇలా రెండో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం బిజినెస్లను మాత్రమే సమంత చూసుకోబోతున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం సమంత కమిట్ అయిన సినిమాలను అలాగే వెబ్ సిరీస్లను పూర్తి చేసిన తర్వాత కొత్త వాటికి కమిట్ అవ్వకుండా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సమంత గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.