వచ్చే సంవత్సరం భారత్ అంతర్జాతీయ స్వర్ణోత్సవ చిత్రోత్సవాన్ని అతి ఘనంగా జరపడానికి నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సమాచార శాఖా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ తెలిపారు . గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫి ) ప్రారంభమైన తరువాత మంత్రి రాజ్యవర్ధన్ మాట్లాడుతూ 1952లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో ఈ చిత్రోత్సవం ప్రారంభమైందని చెప్పారు . ప్రపంచ సినిమాను ఒకే వేదిక మీదకు తీసుకు రావడం , మన సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ సినిమాను పరిచయం చేయడం , తద్వారా సినిమా వ్యాపారాలను పెంచుకోడం దీని ఉద్దేశ్యమని , ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పారు .
మొదటి చిత్రోత్సవంలో 23 దేశాల నుంచి 200 చిత్రాలు వచ్చాయని , ఈ సంవత్సరం 100 దేశాలనుంచి 1000 సినిమాలు వచ్చాయని మంత్రి తెలిపారు .
మొదట బొంబాయి లో ప్రారంభమై ఆ తరువాత కలకత్తా , బెంగుళూర్ , మద్రాస్ , హైదరాబాద్, త్రివేండ్రం నుంచి 2004లో గోవా వచ్చిందని , అప్పటి నుంచి గోవా అంతర్జాతీయ చిత్రోత్సవానికి వేదికగా ఉందని ఆయన తెలిపారు .
49వ చిత్రోత్సవం ముగింపు ఈ నెల 28న ఉంటుందని అదేరోజు నుంచి 50 వ చిత్రోత్సవం ఏర్పాట్లు ఎలా ఉండాలి , ఏమిమి చెయ్యాలనే దానిపై ఓ కమిటీని వేశామని ఆ కమిటీ గోవా ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాడని రాజ్యవర్ధన్ చెప్పారు . 50 సంవత్సరాల క్రితం చిత్రోత్సవం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన సినిమా చిత్రోత్సవ ప్రస్తానం తెలియ జేస్తామని ఆయన చెప్పారు .