అంతా సవ్యంగా సాగితే తెలుగు సినీపరిశ్రమ నుంచి బోలెడంత పన్ను వసూలవుతుంది. 18శాతం జీఎస్టీ చెల్లించాలి కాబట్టి దాదాపు 1500 కోట్ల బడ్జెట్ (ఏడాదికి 200 సినిమాలు)తో సినిమాలు తీస్తారు కాబట్టి దానిపై ఈ రెండు నెలల లాక్ డౌన్ కారణంగా కొంత జీఎస్టీ నష్టపోయినట్టేనని విశ్లేషిస్తున్నారు.
ఈ రెండు నెలల్లోనే టాలీవుడ్ నుంచి సుమారు 100-120 కోట్ల మేర జీఎస్టీ రూపంలో వసూలవ్వాల్సింది. అదంతా తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది. 50-60 కోట్లు సినిమాలు తీసేవాల్ల రూపేణా.. ఇంకో అంత పెద్ద మొత్తం సినిమాలపై ఆధారపడి బతికే ఆర్టిస్టులు.. డైరెక్టర్లు.. ఇతర నటీనటులు .. శాఖల రూపంలో వసూలయ్యేదన్న అంచనా ఉంది. అంటే ఓవరాల్ గా 100 కోట్ల మేర కేవలం ఈ రెండు నెలల్లో జీఎస్టీ నష్టపోయినట్టేనని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సన్నివేశంలో మరో మూడు నెలలు సినిమా థియేటర్లు తీయరు. పైగా షూటింగులకు అనుమతులు ఇచ్చే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ నుంచి రావాల్సిన ట్యాక్స్ అంతా మిస్సయినట్టేనని అంచనా వేస్తున్నారు. అంటే ఈ లా్ డౌన్ పీరియడ్స్ లోనే 200 కోట్లు పైగా నష్టపోయే ఛాన్సుందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు థియేటర్లు ఓపెనైనా జనం థియేటర్లకు వచ్చేందుకు భయపడే పరిస్థితి ఇంకో ఆర్నెళ్ల వరకూ ఉంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అంటే నష్టం అంతకంతకు పెరుగుతుందే కానీ తగ్గే మార్గం అయితే కనిపించడం లేదనే దీనర్థం.