ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఆకట్టుకున్న అచ్చ తెలుగు సినిమాల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు ‘మేక సూరి’. ఈ చిత్ర దర్శకుడు త్రినాథ్ వెలిసెల రాసుకున్న స్క్రీన్ ప్లేలో ప్రతి పాత్రను కథలోకి తీసుకొచ్చిన విధానం మెచ్చుకోదగినది. సినిమాలో ప్రేమ కథ చాలా సస్పెన్స్ ప్లేతో సాగుతూ మంచి అనుభూతిని మిగులుస్తోంది. అంతలోనే మళ్ళీ విషాదపు ప్రేమ కథగా కథనం టర్న్ అయి అద్భుతమైన భావోద్వేగాలతో చివరికి వచ్చే సరికి ఈ సినిమా మన హృదయాన్ని కదిలిస్తోంది.
అలాగే సినిమాలోని పాత్రలకు ఏం జరుగుతుందో అసలు హీరోయిన్ ను ఎవరు చంపారు అనే ఉత్సుకతను దర్శకుడు త్రినాథ్ వెలిసెల బాగా మెయిటైన్ చేశాడు. క్లైమాక్స్ ముగిసే సరికి సినిమా మీద మంచి భావేద్వేగంతో కూడుకున్న ఫీల్ తో పాటు తరువాత వచ్చే పార్ట్ 2 పై ఆసక్తి కలుగుతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సంస్థ ఏరికోరి ఈ ‘మేక సూరి’ మూవీ సిరీస్ ను తీసుకుంది అంటేనే అర్ధం అవుతుంది. ఈ సినిమా స్థాయి ఏమిటో అని. నూతన దర్శకుడు అయినప్పటికీ త్రినాథ్ వెలిసెల పనితనం అద్భుతం.
ఇక సినిమాలో పార్థు సైనా ఛాయాగ్రహణం మంచి వాతావరణాన్ని బాగా ఎలివేట్ చేసింది. ప్రజ్వల్ క్రిష్ నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అభినయ్, సుమయ జంటగా నటించారా.. లేక నిజంగానే జీవించారా అనే భావన మనకు కలుగుతుంది అంటే.. ఆ క్రెడిట్ దర్శకుడు త్రినాథ్ వెలిసెల ఇవ్వాలి. ఈ సినిమాతో ఇండస్ట్రీకి మరో సహజసిద్ధమైన డైరెక్టర్ వచ్చాడు. ఈ కరోనా కాలంలో ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకండి. నిర్మాత కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.