ఒక్క పోస్టర్ కూడ రాకుండానే 200 కోట్ల బిజినెస్ చేసిన సినిమా

Ajith's Vaalimai did 200 crore pre release
Ajith's Vaalimai did 200 crore pre release
 
అజిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘వాలిమై’. చాలాకాలం తర్వాత అజిత్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.  అజిత్ అభిమానులైతే చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
రిలీజ్ అప్డేట్స్ ఇవ్వమని నిర్మాత బోనీ కపూర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు.  చూడబోతే సినిమా విడుదలకు ఫ్యాన్స్ పెద్ద పండుగ చేసేలానే ఉన్నారు.  అజిత్ సినిమా అంటే మామూలుగానే పెద్ద హడావుడి, విపరీతమైన బిజినెస్ ఉంటుంది.  అవి ఈ ‘వాలిమై’ చిత్రానికి రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయి.  
 
సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దగ్గరదగ్గర 200 కోట్ల రూపాయల వరకు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమా టైటిల్ తప్ప పోస్టర్లు కానీ టీజర్, ట్రైలర్ లాంటివి కానీ విడుదలకాలేదు. అవేవీ రాకుండానే ఈ స్థాయి బిజినెస్ జరగడం అంటే విశేషమే.  ఇది అజిత్ మార్కెట్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రూవ్ చేస్తోంది. 
 
ఈ చిత్రాన్ని అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నారు.  ఇదే కాదు అజిత్ తర్వాతి సినిమాకు కూడ ఇతనే దర్శకుడు.  ఇక ‘వాలిమై’ రిలీజ్ విషయానికి మిగిలి ఉన్న కొద్దిపాటి షూటింగ్ ముగియగానే నిర్మాత నుండి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది.