2.0 స్టార్ ప్రపంచంలోనే టాప్ 4 సంపాదకుడు
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 10 వరల్డ్ బెస్ట్ ఎర్నర్స్ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో టాప్ 4 సంపాదకుడిగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ పేరు జాబితాలో నిలిచింది. నంబర్ వన్ సంపాదకుడిగా డ్వేన్ జాన్సన్(47).. నంబర్ 2 సంపాదకుడిగా అవెంజర్స్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్.. నంబర్ 3 ఎర్నర్ గా అవెంజర్స్ లోనే నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ పేర్లు జాబితాలో నిలిచాయి. గతంలో వరుసగా రెండు సీజన్లకు నంబర్ వన్ సంపాదకుడిగా ఉన్న విల్ స్మిత్ ఈసారి టాప్ 10 కి పడిపోవడం ఆసక్తికరం.
2018-19 సీజన్ లో కిలాడీ అక్షయ్ కుమార్ ఏకంగా నాలుగైదు బ్లాక్ బస్టర్లలో నటించాడు. ఒక్కో సినిమాకి 5 మిలియన్ డాలర్ల నుంచి 10 మిలియన్ డాలర్లు (60-70 కోట్లు) సంపాదిస్తూ అక్షయ్ టాప్ ఎర్నర్ గా నిలిచాడు. అతడు ఏకంగా ఇరవై పైగా కార్పొరెట్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. ఓవరాల్ గా 65 మిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచంలోనే నాలుగో అత్యుత్తమ సంపాదకుడయ్యారు. అక్షయ్ కుమార్ పక్షి రాజు గా నటించిన 2.0 గత ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే గోల్డ్, కేసరి చిత్రాలు విజయం సాధించాయి. గత వారం రిలీజైన `మిషన్ మంగళ్` అక్షయ్ కి మరపురాని విజయాన్ని అందించింది. వరుస విజయాలతో కిలాడీ సంపాదన అంతకంతకు పెరుగుతోంది. ఒక రకంగా అక్షయ్ ఆదాయం పరిశీలిస్తే ఏడాదికి సుమారు 467 కోట్లు (65 మిలియన్ డాలర్లు) ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఫోర్బ్స్ 2019 సంపన్న హీరోల జాబితా
*డ్వేన్ జాన్సన్ – 89.4 మిలియన్ డాలర్లు
*క్రిస్ హేమ్స్ వర్త్ -76.4 మిలియన్ డాలర్లు
* డౌనీ జూనియర్- 66 మిలియన్ డాలర్లు
* అక్షయ్ కుమార్- 65 మిలియన్ డాలర్లు
* జాకీ చాన్- 58 మిలియన్ డాలర్లు
* బ్రాడ్లీ కూపర్ – 57 మిలియన్ డాలర్లు
* ఆడమ్ సాండ్లర్- 57 మిలియన్ డాలర్లు
* క్రిస్ ఇవాన్స్-43.5 మిలియన్ డాలర్లు
* పాల్ రుడ్ 41 మిలియన్ డాలర్లు
* విల్ స్మిత్ – 35 మిలియన్ డాలర్లు