బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి దెబ్బ మీద దెబ్బ….?

కామన్ మాన్ కి ఏం కావాలో అక్షయ్ కుమార్ కి తెలుసు. అందుకే ఆయన ఏ సినిమా చేసినా ఎంటర్టైన్మెంట్ ప్రధాన అంశంగా సినిమాలు తీస్తూ ఉంటాడు. చాలా వరకు హీరోలు ఒకటి రెండు లేదా మూడు సినిమాలు హిట్ కొట్టి … క్రేజీ స్టార్ గా నిలబడతారు కానీ. అక్షయ్ కుమార్ ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సాధించిన హిట్లు ఈ జనరేషన్లో ఏ హీరో సాధించ లేదంటే అతిశయోక్తి కాదు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ కిలాడి గా పేరు సంపాదించాడు. అయితే అన్ని సార్లు లక్కు మన వెంటే ఉండదని కాలం నిర్ణయించింది.

Akshay Kumar looks fierce in the poster of 'Laxmmi Bomb' - APN Live

వరుస హిట్లతో మంచి ఊపు మీదున్న అక్షయ్ ప్రస్తుతం ఫ్లాప్ దెబ్బతో సతమతమవుతున్నాడు. ఏ ముహూర్తాన సౌత్ ఇండస్ట్రీ సినిమాలు డబ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడే కహాని ఖతం అయ్యింది అన్న కామెంట్స్ బాలీవుడ్ లో వినిపిస్తున్నాయట. తనదైన శైలిలో యాక్టింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ ఇప్పుడు… హిట్ కు ఆమడ దూరమైపోయాయి. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అందుకున్న కాంచన మూవీని రీమేక్ చేయడం వల్లే ఆయన అభిమానులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కాంచన మూవీ ని బాలీవుడ్ లో లక్ష్మీ గా చిత్రీకరించారు. ఈ మూవీలో బోల్డ్ స్టార్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

Durgavati shoot begins: Akshay Kumar and Bhumi Pednekar share pic from  mohurat - Movies News

అయితే ఈ సినిమా పెద్దగా హిందీ ప్రేక్షకులకు ఎక్క లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో… ఓటిటి ప్లాట్ఫామ్ వేదికగా లక్ష్మి సినిమా రిలీజ్ అయింది. అయితే ఎన్నో విభిన్న కథలతో గెటప్స్ తో తన అభినయంతో ఆకట్టుకున్న అక్షయ్ ఈ సినిమాతో మాత్రం చతికిల పడాల్సీ వచ్చింది. దీంతో వరుస హిట్లు సంపాదించుకున్న అక్షయ్ లక్ష్మితో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఇది చాలదన్నట్టు.. తెలుగులో మంచి హిట్ ను సాధించిన భాగమతి సినిమా ని నిర్మించి మరో తప్పు చేశాడు అక్షయ్ అంటున్నారు. దీంతో గత నాలుగేళ్లుగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న అక్షయ్ ఒక్కసారిగా పట్టాలు తప్పాడు. నిర్మాతగా ఈ సినిమా అక్షయ్ కి షాకిచ్చింది. మొత్తానికి వరసగా అక్షయ్ కుమార్ కి దెబ్బ మీద దెబ్బ తగిలింది.