పీవీ సింధు బ‌యోపిక్ లో కిలాడీ కోచ్?

పీవీ సింధు జీవిత‌క‌థ‌లో కిలాడీ కోచ్?

భార‌త‌దేశం త‌ర‌పున ఒలింపిక్ మెడ‌ల్ సాధించిన బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా పీవీ సింధు పేరు మార్మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. అలాగే బీడ‌బ్ల్యూ ఎఫ్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్ లో బంగారు ప‌త‌కం సాధించి సంచల‌నం సృష్టించిన పీవీ సింధుకి తెలుగు గ‌డ్డ‌పైనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు నీరాజ‌నాలు ప‌లికారు. సైనా నెహ్వాల్ లాంటి స్టార్ ప్లేయ‌ర్ ని త‌యారు చేసిన పుల్లెల గోపిచంద్ సింధుకి శిక్ష‌ణ‌నిచ్చారు. గురువు పేరు ప్ర‌ఖ్యాతుల్ని విశ్వ‌విఖ్యాతం చేస్తూ సింధు బ్యాడ్మింట‌న్ లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డంపైనా ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు.

అప్ప‌ట్లో ఒలింపిక్ ప‌థ‌కం గెలుచుకున్న సింధు జీవితంపై బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు సోనూసూద్ రైట్స్ ని ఛేజిక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లుగా అత‌డు తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. స్క్రిప్టు ప‌నులు స‌హా ప్ర‌తిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడ‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. అయితే బీడ‌బ్ల్యూ ఎఫ్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్ తాజా విక్ట‌రీ నేప‌థ్యంలో సోనూసూద్ ఈ పాయింట్ ని కూడా త‌న క‌థ‌లోకి చేర్చుతున్నాడ‌ని తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ .. పీవీ సింధు కోచ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అంటే కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తోంది. అక్ష‌య్ సైతం ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని.. అత‌డు న‌టిస్తే బావుంటుంద‌ని పుల్లెల గోపీచంద్ అన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కిలాడీతో సోనూసూద్ బృందం మంత‌నాలు సాగించారా లేదా? అస‌లేం జ‌రిగుతోంది? అన్న‌ది మ‌రింత వివ‌రంగా తెలియాల్సి ఉంది. అక్ష‌య్ న‌టించిన తాజా చిత్రం `మిష‌న్ మంగ‌ళ్` ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఒకే ఏడాదిలో మూడు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న స్టార్ గా అతడి పేరు మార్మోగిపోతోంది. ఒక‌వేళ పీవీ సింధు బ‌యోపిక్ కి కిలాడీ అక్కీ సంత‌కం చేస్తే అది మార్కెట్ వ‌ర్గాల్లో మ‌రింత బూస్ట్ నిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.