హోలీ సంబ‌రాల్లో యంగ్ టైగ‌ర్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాంచి జోరుమీదున్నాడు. చాలా కాలంగా జక్క‌న్న రాజ‌మౌళి తో సినిమా చేయాల‌ని వేదిక‌ల మీదే ఫ్యాన్స్‌తో అడిగించి మొత్తానికి `ఆర్ ఆర్ ఆర్‌`లో స్థానం సంపాదించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ సినిమా త‌రువాత వెంట‌నే మ‌రో చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్‌`లో కొమ‌రంభీం పాత్ర‌లో న‌టిస్తూ చ‌రిత్ర‌లో నిలిచిపోయే చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో గ‌డిపే ఆ చిన్న సంద‌ర్భాన్ని కూడా మిస్ చేసుకోవ‌డం లేదు.

గ‌త కొన్ని రోజులుగా `ఆర్ఆర్ఆర్‌` షూటింగ్‌లో బిజీగా గ‌డిపేస్తున్న‌యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంగ‌ళ‌వారం కుటుంబంతో క‌లిసి హోలీ సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. త‌న భార్య పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన ఓ సెల్ఫీని ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక అభిమానుల కోసం పంచుకుని హోలీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ హోలీ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అన్న‌ట్టు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ చేయ‌బోతున్న సినిమా మే నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.