హీరోలే అన్నీ అయితే ప‌క్కోడి ప‌రిస్థితి ఏంటి?

ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ మొద‌లైంది. ఏదైనా ఒక కొత్త సినిమా మొద‌లైందంటే. మన టాలీవుడ్ లో అంతా గుత్తాధిపత్యం ఏకచక్ర ఆధిపత్యం లాగా ఈ మ‌ధ్య హీరోలే అన్ని ప‌నులు చేసేస్తున్నారు. సినిమా హీరోలు వాళ్లే ఉంటారు. సొంత బ్యాన‌ర్లు పెట్టేసి నిర్మాతలుగా వాళ్లే ఉంటున్నారు. ఇక కొంద‌రు అయితే కొత్త‌గా మ‌ల్టీప్ల‌క్స్‌లు క‌ట్టేసి థియేటర్ల యజమానులు వాళ్లే అయిపోతున్నారు. ఇక సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్లే ఉంటారు.

ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ కేవలం నాలుగైదు కుటుంబాలకు చెందిన వ్యక్తుల చేతుల్లో నలిగి పోతుంది. సినిమా రంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని శాసిస్తున్న వాళ్ళు కేవలం తాము నిర్మిస్తున్నసినిమాల‌కే ప్రాధాన్య‌తనిస్తూ లేదంటే వాళ్ళు పంపిణీ చేసే సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇస్తూ ఉంటారు. ఒక చిన్న సినిమా ఈరోజు థియేటర్లలోకి రావాలంటే ఆ నిర్మాత ప‌డే క‌ష్టాలు అన్నీ ఇన్నీ కాదు.

ముందు డిస్ట్రిబ్యూట‌ర్ గా కెరియ‌ర్‌ని మొద‌లుపెట్టి ఆ త‌ర్వాత నిర్మాత‌లై ఎక్క‌డికో వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త నిర్మాతలు, కొత్త హీరోలు, కొత్త డిస్ట్రిబ్యూటర్లు ఇలా ఎవ‌రైనా స‌రే కొత్త‌వారు రావాలంటే వాళ్ళ‌కు నరకం కనబడుతుంది. ఒకవేళ ఒకరిద్దరు ఔత్సాహిక నిర్మాతలు వచ్చిన ఇక్కడున్న థియేటర్లు ఈ గోలంతా చూసి వాడు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. ఉన్నవారిలో అందరినీ మనం తప్పు పట్టడం లేదు. కానీ ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వాళ్ళను మాత్రం విమర్శించాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్మాత‌ల నుంచి పెద్ద నిర్మాత‌ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రికి స‌మానంగా థియేట‌ర్లు ఇస్తే కొత్త‌వారికి కూడా అవ‌కాశం క‌ల్పించిన వాళ్ళ‌మ‌వుతాం. అలాగే హీరోలే అన్నీ తామై సినిమాలు తీయ‌డం వ‌ల్ల నిర్మాత అనేవాడు బ్ర‌త‌క‌డం క‌ష్ట‌మ‌యిపోత‌ది. మ‌రి కొంద‌రు హీరోలైతే ఇంకాస్త ముందుకెళ్ళి సినిమాలో న‌టించినందుకు రెమ్యూన‌రేష‌న్‌కి బ‌దులు వాటాలు అడ‌గ‌టం మొద‌లుపెట్టారు. దాంతో నిర్మాత‌లు బెంబేలెత్తిపోతున్నారు.