ప్రస్తుత విపత్తుని టాలీవుడ్ ఏ మాత్రం ఊహించలేదు..ఈ స్థాయిలో జన జీవితం స్థంభించి పోతుందని, నిత్యం రద్దీగా వుండే మాల్స్, థియేటర్స్, మల్టీప్లెక్స్‌లు ఒక్కసారిగా నిర్మానుషంగా మారిపోతాయని ఎవరూ ఊహించి లేదు. దీంతో టాలీవుడ్ భవితవ్యం ప్రశ్నార్థకంలో పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరిచి బొమ్మపడాలంటే మరో ఐదారు నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఇప్పటికే మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి చేరిపోయాయి. పరిస్థితులు రోజు రోజుకూ మారుతున్నాయి. ఇలాగే వుంటే లాక్ డౌన్ మే 7న ఎత్తివేయడం కుదరని పని తెలంగాణలో అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించేలా కనిపించడం లేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దంపడుతున్నాయి. కరోనా కంట్రోల్లోకి రావాలంటే మరింత కాలం ప్రజలు లాక్్‌డౌన్‌కు సహకరించాల్సిందే అంటున్నారు. అంటే మే 7 న ముందు చెప్పినట్టు లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపించడం లేదని అర్థమవుతోంది.
ఈ విషయం తెలిసి సినీ పెద్దలు ముఖ్యంగా నిర్మాతలు, హీరోలు కంగారు పడుతున్నారట. లాక్‌డౌన్ పొడిగించే పరిస్థితులే ఎదురైతే ఆరు నెలల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి లాళం వేసుకోవాల్సిందే అని కంగారు పడుతున్నారట. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి ఇండస్ట్రీని, దాన్ని నమ్ముకుని జీవిస్తున్న లక్షలాది మంది జీవితాల్ని కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలని గత కొన్ని రోజులుగా వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మే 7న తరువాత ఇండస్ట్రీ సరికొత్త కార్యచరణని ప్రకటించే అవకాశం వున్నట్టు ఇన్ సైడ్ టాక్.