హిట్ కోసం పూరి మరీ ఇంతలా దిగజారుడా?

పూరి ఏం చేస్తున్నాడో తెలుస్తోందా?

సాధారణంగా పూరి జగన్నాధ్ సినిమా అంటేనే రొమాన్స్, పక్సా మాస్ సీన్స్ గుర్తుకువస్తాయి. అలాంటిది ఆయన కాన్సర్టేట్ చేస్తే ఇస్మార్ట్ శంకర్ వస్తాడు. కొడుకు కెరీర్ కు లైఫ్ ఇవ్వాలని నిర్మాతగా మారితే రొమాన్స్ లో పరాకాష్ట చూపిస్తాడు. ఇప్పడు పూరి నిర్మాతగా ఆయన కొడుకు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం రిలీజైంది. టైటిల్ కి తగ్గట్టుగానే సినిమాను పూరి తన స్టైల్ లో రూపొందిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. హీరోయిన్ కేతిక శర్మ వెనక వీపుభాగం మొత్తం ఎటువంటి బట్టలు లేకుండా ఉన్నది. హీరోయిన్ ను ఆకాష్ పూరి గట్టిగా హగ్ చేసుకొని ఉంటాడు.

హీరో, హీరోయిన్ కౌగిలించుకున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ లో చూసిన వాళ్లు షాక్ అయ్యారు. కొడుక్కి హిట్ ఇవ్వాలని మోతాదు మించి ముందుకు వెళ్తున్నాడు,రొమాంటిక్ శృతిమించినట్టుగా ఉంది అంటున్నారు. అయితే కొందరు మాత్రం పూరి ఈ పోస్టర్ తో యూత్ కి పిచ్చెక్కించారు అంటున్నారు. తెలుగు సినిమాలు క్రమేణా బూతు సినిమాలుగా మారుతున్నాయోమో అనిపిస్తోంది అని మరికొందరు సోషల్ మీడియాలో నిట్టూర్పులు విడుస్తున్నారు.

అనిల్ పాదూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ సరసన..కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్ప‌టికే సినిమా హైద‌రాబాద్‌, గోవా షెడ్యూల్స్‌ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సోమ‌వారం నుండి కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌ లోనే ప్రారంభం కానున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది యూనిట్. ఇస్మార్ట్ శంక‌ర్‌ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌ పై పూరి, చార్మి ఈ సినిమాను నిర్మించడంతో..ఈ రొమాంటిక్ మూవీపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.

ప్రస్తుతం బోల్డ్ సినిమాల ట్రెండ్ కు ఫుల్ క్రేజ్ ఉంది కాబట్టి అందుకు తగ్గట్లే ఉండబోతోందని ఫస్ట్ లుక్ తోనే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టాప్ లెస్ పోస్టర్లు బాలీవుడ్ కు కొత్త కాదేమో కానీ టాలీవుడ్ కు మాత్రం కొత్తే.