హాలీవుడ్ క్రేజీ రీమేక్ లో శ్రుతి-అక్ష‌ర ట్రీట్

                                 ఒకే ఫ్రేమ్‌లో సిస్ట‌ర్స్ ట్రీట్ పీక్స్

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టీలు శ్రుతిహాస‌న్- అక్ష‌ర హాస‌న్ ఓ క్రేజీ హాలీవుడ్ రీమేక్ లో న‌టించ‌నున్నార‌ని తెలిసింది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించే తొలి సినిమా ఇదే అవుతుంది. ఇన్నాళ్లు అక్ష‌ర కెరీర్ అంతంత మాత్ర‌మే. శ్రుతిహాస‌న్ త‌న కెరీర్ ని త‌నే కాల‌రాసుకుంది.

కానీ ఇప్పుడు కంబ్యాక్ కోసం సిస్ట‌ర్స్ చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. హాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన `డోంట్ బ్రీథ్` త‌మిళంలో రీమేక్ కానుంది. ఇందులో చియాన్ విక్ర‌మ్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా .. శ్రుతిహాస‌న్ – అక్ష‌ర హాస‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ట‌.

ఇంత‌కీ డోంట్ బ్రీథ్ క‌థేమిటి? అంటే .. ఓ రిటైర్డ్ ఆర్మీ మేజ‌ర్ ఇంట్లో దొంగ‌త‌నానికి వెళ్లిన ముగ్గురు టీనేజీ దొంగ‌లు అత‌డు ప‌న్నిన ఉచ్చులో ఎలా ఇరుక్కున్నారు? ఆపై ఆ ఇంట్లో ఏం జ‌రిగింది? అన్న‌ది ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆర్మీ మేజ‌ర్ పాత్ర‌లో విక్ర‌మ్ న‌టించేందుకు ఆస్కారం ఉండ‌గా.. టీనేజీ దొంగ‌గా శ్రుతి న‌టించే ఛాన్సుంటుంది. అక్ష‌ర పాత్ర ఏమిట‌న్న‌ది చిత్ర‌బృందం రివీల్ చేయాల్సి ఉంటుంది.