టాలీవుడ్‌లో కొంత మంది హీరోలు ఎవరి పని వారిని చేసుకోనివ్వరు. ప్రతి విషయంలోనూ ఇన్‌వాల్వ్ అవుతుంటారు. ఉదాహరణ దర్శకుడి పని దర్శకుడిని చేసుకోనివ్వరు. కథ, డైలాగులు, ఆఖరికి దర్శకత్వం విషయంలో కూడా ఇన్‌వాల్వ్ అవుతూ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా సర్వం వీళ్ళకే తెలుసు అన్నటు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విషయంలో దర్శకులు ఎటూ చెప్పలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాగని ఎదురు కూడు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి. వీళ్ళను ఢీకొనేంత స్థాయి వీరికి ఉండదు. ఇక తెలుగులో రాజమౌళి ఒక్కడే హీరోలను మేనేజ్ చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడని చెప్పాలి. మిగిలిన వారి పరిస్థితి అలా ఉండదు ఎక్కడో ఒకచోట పెద్ద స్థాయి హీరోలయితే ఖచ్చితంగా భయపడాల్సి ఉంటుంది. ఇక ఆ దర్శకులకి ఎంత ఇమేజ్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో హీరోల మాట వినాల్సి వస్తుంది.
అలాగే వారు గతంలో చేసిన చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయినా కూడా వీళ్ల మాటలు ఖచ్చితంగా వినాల్సి వస్తుంది. అలాంటి దర్శకులకి కూడా చుక్కలు చూపిస్తూ ఉంటారు ఈ హీరోలు. ఇక ప్రతీ దర్శకుడికి ఆ హీరోతో పని చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే ఆయన కూడా దర్శకులతో కలిసి పని చేస్తాడు. ఆ సమయంలో దర్శకుడు కాదని చెప్పకూడదు. ఆయన చెప్పిందే వేదంలా చెయ్యాలి. ఈ సదరు దర్శకుడికి కూడా ఇప్పుడు ఇదే తిప్పలు ఎదురవుతుందని తెలుస్తుంది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటే వచ్చిన అవకాశం కావడంతో ఆ దర్శకుడు రెండేళ్లుగా ఆయన కోసం వేచి చూసి.. ఈ మధ్యే సినిమా మొదలుపెట్టాడు. కాంబినేషన్ సెట్ అయినా కూడా ఇప్పుడు మాత్రం ఆ హీరో కథలో కాళ్లు వేళ్లు అన్నీ పెడుతుండటంతో దర్శకుడికి చుక్కలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఇప్పటి వరకు చాలా ఫ్రీగా పని చేసుకున్న ఆ దర్శకుడికి ఈ తరహా వర్కింగ్ స్టైల్ అస్సలు నచ్చడం లేదని తెలుస్తుంది. కానీ ఎదురు చెప్పలేక అలాగని ఆయన చెప్పింది చెయ్యలేక మధ్యలో నలిగిపోతున్నాడు ఆ దర్శకుడు. ఏది ఏమైనప్పటికీ సినీ వర్గాల సమాచారం వరకు అవుట్ పుట్ మాత్రం అదిరిపోయేలా వస్తోందట. హీరో కథలో వేలు పెట్టినా కూడా చెడగొట్టేలా లేకపోవడం ఆ దర్శకుడికి కాస్త ఊరటనిచ్చే విషయం. కానీ కెరీర్ మార్చే సినిమా కావడంతో అన్నీ నెమ్మదిగా భరిస్తూ ఎవ్వరినీ కాదనలేక కామయిపోయాడు ఆ దర్శకుడు.