క్రేజీ హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేరు తెచ్చుకుంది శృతిహాసన్. కమల్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా తన మార్కుని చూపించే ప్రయత్నం చేసింది. అయితే గత కొంత కాలంగా తన జోరుని తగ్గించింది. హీరోయిన్‌గా పట్టుని కోల్పోయింది. కారణం ప్రేమలో పడింది. విదేశీయుడితో డేటింగ్ చేసింది. చెట్ట పట్టాలేసుకు తిరిగింది. పెళ్లి చేసుకుంటుందా? అనేంతగా వార్తల్లో కెక్కింది.
కట్ చేస్తే ప్రేమికుడితో బ్రేకప్ మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రవితేజ నటిస్తున్న `క్రాక్` చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. సెకండ్ ఇన్నింగ్స్ అయినా సాఫీగా సాగుతుందని ఆశగా వుంది. ఇదిలా వుంటే లాక్‌డౌన్ వేళ ఇంటి పట్టునే వుంటున్న శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకుంది.
గులాబి, చాక్లెట్, పెన్సిల్‌తో పాటు తనకు సిగరెట్ అన్నా టొబాక్కో అన్నా ఇష్టమని చెప్పడంతో అభిమానులు, నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే సిగరెట్ కాల్చినప్పుడు వచ్చే వాసనని మాత్రం తను ఇష్టపడనని చెప్పడంతో శృతికి స్మోకింగ్ అలవాటు లేదని ఊపిరి పీల్చుకున్నారు.