సాహో మొదటి సింగల్ విడుదల

బాహుబలి ప్రభాస్ తరువాతి సినిమా ‘సాహో’. రెండు సంవత్సరాల ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ఆగష్టు 15 న ఫలించబోతోంది. విడుదలకు ముందు ప్రమోషన్స్ జోరు పెరుగుతుంది కదా. అందులో భాగంగానే చిత్ర బృందం మొదటి సింగల్ ను విడుదల చేసింది. ఆ మధ్య సినిమా పూర్తి అయినా సంగీత దర్శకుడు దొరక్క ఇబ్బంది పడినా మొత్తానికి ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకుడు స్వరాలు సమకూర్చారు. ‘సైకో సైయాన్’ అంటూ సాగే పాటలో డాన్స్ ఫ్లోర్ పై హీరోహీరోయిన్లు డాన్స్ ఇరగదీసి ఉంటారని ఊహాగానాలు ఉన్నాయి. అది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.