Daaku Maharaaj: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తూ రెండువైపులా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. సినిమాల పరంగా గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. భలే బాబు నటించిన గత మూడు సినిమాల్లో ఒకదాన్ని మించి ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. అందులో భాగంగానే ఇప్పుడు సంక్రాంతికి మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
బాబీ దర్శకత్వంలో బాలయ్య బాబు డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
కాగా ఈ మూవీ సాంగ్ ప్రొమోను రేపు అనగా డిసెంబర్ 13 శుక్రవారం ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. ఇక పూర్తి పాటను డిసెంబర్ 14 వ తేదీన అంటే శనివారం విడుల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇక అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలయ్య అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.