మొన్నామధ్య శ్రద్ధా కపూర్.. ఇప్పుడేమో అలియా భట్.. ఇద్దరికీ ఒకటే సమస్య.! తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఈ బ్యూటీస్ ఒకింత ఎదురుచూడాల్సి వస్తోంది. ఇంకో సినిమా చేయడం కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోందని అనడం సబబేనా.? అంతేనేమో.!
లేకపోతే, ‘సాహో’ సినిమా తర్వాత శ్రద్ధా కపూర్‌కి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు.? ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అలియా భట్ మరో తెలుగు సినిమాకి ఎందుకు కమిట్ కాలేదు.? ‘సాహో’ డిజాస్టర్ గనుక, శ్రద్ధా కపూర్ మీద ఐరన్ లెగ్ ముద్ర పడింది కాబట్టి, అవకాశాలు రావట్లేదనుకోవచ్చు.. అది కొత సబబే.
కానీ, అలియా భట్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది.? ప్చ్, కారణాలైతే లేవ్. కానీ, అలియా భట్‌తో సినిమా అంటే, పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఈ మధ్య ఓ సినిమా కోసం ఓ యంగ్ డైరెక్టర్, అలియా భట్ పేరుని నిర్మాత ముందుంచితే, ‘వద్దులే’ అనేశాడట ఆ నిర్మాత.
అలియా భట్ ఈ మధ్యన రెమ్యునరేషన్ తగ్గించుకుందట.. అని చెప్పినా, ‘ అయినాగానీ, మనం భరించలేం’ అని ఆ నిర్మాత పునరుద్ఘాటించారట. ఆ మధ్య శ్రద్ధా కపూర్ విషయంలోనూ ఇలాగే జరిగింది.
పాన్ ఇండియా క్రేజ్ వస్తుందని తెలిసీ, అలియా భట్ లాంటి క్రేజీ హీరోయిన్‌ని ఎందుకు టాలీవుడ్‌లో లైట్ తీసుకుంటున్నట్లు.? తగ్గించిన రెమ్యునరేషన్ కూడా భరించలేనంతగా వుండటం వల్లేనా.?