వామ్మో పెద్ద ప్లానే వేస్తున్న సుజీత్.??

Saaho-director-Sujeeth-next-with-Zee-Studios

టాలీవుడ్ సినిమా దగ్గర తమ మొదటి సినిమా తోనే అమితంగా ఇంప్రెస్ చేసి రెండో సినిమానే భారీ పాన్ ఇండియా సినిమా ఛాన్స్ అందుకున్న దర్శకులు దాదాపు చాలా తక్కువ మందే ఉంటారు. అయితే అలాంటి తక్కువమంది దర్శకుల్లో యంగ్ దర్శకుడు సుజీత్ కూడా ఒకడు.

అయితే సుజీత్ తెరకెక్కించిన మొదటి సినిమా రన్ రాజా రన్ తో అదిరే హిట్ అందుకొని నెక్స్ట్ సినిమానే ప్రభాస్ తో సాహో అనే బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా ని చేసాడు. తన ఏక్షన్ విజన్ కి టేకింగ్ కి మంచి మన్ననలు కూడా తనకి దక్కాయి. అయితే ఇప్పుడు సుజీత్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ తో “ఓజి” అనే సెన్సేషనల్ చిత్రాన్ని చేస్తుండగా.

ఈ సినిమా షూటింగ్ ఇపుడు ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయ్యిపోయింది. ఇలా పక్కా ప్లానింగ్ ప్రకారం చేస్తున్న ఈ సినిమా విషయంలో సుజీత్ చేసిన మాస్ ప్లాన్ ఇపుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఈ ప్లాన్ లో అయితే ప్రభాస్ సినిమా సాహో తో లింక్ అయ్యి ఉంది అనే అంశం ఊహించనిదిగా మారింది.

యెస్ ఓజి, సాహో చిత్రాలకి లింక్ ఉందట. సాహో సినిమాలో చెప్పే వాజీ సిటీ రిలేటెడ్ గా ఇపుడు ఓజి లో సన్నివేశాలు ఉన్నాయట. అంతే కాకుండా కాకుండా సాహో లాస్ట్ లో ప్రభాస్ ని చంపడానికి ఎవరో ప్లాన్ చేసినట్టుగా కూడా ఓ షాట్ ఉంటుంది. వీటితో సుజీత్ ఏదో భారీ ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ ఇపుడు ఊపందుకుంది. మరి అసలు నిజంగా ఈ సినిమాలకి లింక్ ఉందా లేదా అనేది ఆగి చూడాల్సిందే.