సాహో కు U/A సెన్సార్ సర్టిఫికెట్ ఆగస్ట్ 30 విడుదల

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి U/A సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించడం విశేషం.
అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తోంది సాహో. హాలీవుడ్ సినిమాల స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు.

ప్రభాస్ కెరీర్ లొనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజ‌య్, జాకీ ష్రాఫ్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
ఆగస్టు 30న సాహో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్ల లో ప్రేక్షకుల ముందుకు రానుంది.