‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రబాస్ నుంచి వచ్చిన సినిమాలు ‘సాహో’, ‘రాధే శ్యామ్’. ఈ రెండూ భారీ అంచనాలతో వచ్చాయ్. కానీ, భారీగా నష్టాలు మిగిల్చాయ్.
అయితే, ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాల తీరు ఓ ఎత్తు. తాజా సినిమా ‘ఆదిపురుష్’ తీరు ఇంకో ఎత్తు. 400 కోట్లు, 500 కోట్లు వసూళ్లు వచ్చేశాయంటున్నారు. కానీ, గ్రౌండ్ లెవల్లో అంత సీను లేదు. సగానికి పైగా నష్టాలు వచ్చాయని ట్రేడ్ రిపోర్ట్స్ అందుతున్నాయ్. దాంతో, ప్రబాస్ చాలా డిజప్పాయింట్ అవుతున్నాడట. ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాతే డీలా పడిపోయాడట ప్రబాస్.
అత్యంత సన్నిహితులతో తప్ప ఎవరితోనూ టచ్‌లో లేడట. ఇదంతా ఇలా వుంటే, ఈ ఎఫెక్ట్ ఎక్కడ ‘సలార్’ మీద పడుతుందో అని కొత్తగా ఆందోళన మొదలైందట ప్రబాస్‌లో.
ప్రస్తుతం ప్రబాస్ హోప్స్ అన్నీ ‘సలార్’ పైనే. ఈ సినిమా రిజల్ట్ ఏమైనా అటూ ఇటూ అయ్యిందా ఇక అంతే సంగతి ప్రబాస్ అడ్రస్ గల్లంతే. కానీ, ‘సలార్’ విషయంలో ప్రశాంత్ నీల్‌ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. చూడాలి మరి.