మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` హవా తగ్గడం లేదు. ఈ సంక్రాంతి బరిలో జనవరి 11న రిలీజైన ఈ చిత్రం వసూళ్ల పరంగా ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తూ వరుస రికార్డులు సాధిస్తూనే వుంది. పోటీగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` వున్నా ఎక్కడా తగ్గడం లేదు. 22 రోజులు దాటినా అదే జోరుని కొనసాగిస్తూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. మహేష్ తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టి మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ వారం పూర్తయ్యే సరికి వసూళ్ల పరంగా టాప్ 4లో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 106.6 కోట్ల షేర్‌ని వసూలు చేసి ఆల్‌టైమ్ రికార్డుని సాధించిన సినిమాల్లో4వ స్థానాన్ని దక్కించుకుంది. 22 డేస్‌లో 115 కోట్ల షేర్‌ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల షేర్‌ని సాధించింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల 22 రోజుల్లో సాధించిన షేర్ వివరాలు:
పైజాం – 38.8 కోట్లు
సీడెడ్ – 16.07 కోట్లు
గుంటూరు – 9.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 19.73 కోట్లు
తూర్పు గోదావరి – 11.05 కోట్లు
పశ్చిమ గోదావరి – 7.3 కోట్లు
కృష్ణా – 8.7 కోట్లు
నెల్లూరు – 4.05 కోట్లు
22 డేస్ టోటల్ షేర్ – 115.4 కోట్లు
కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా – 11.9 కోట్లు
ఓవర్సీస్ – 12.70 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 22 రోజుల షేర్ – 140 కోట్లు