Throw Back బీచ్ లో బీభత్సం చేస్తున్న లక్ష్మి రాయ్!

చేతినిండా సినిమాలు లేక‌పోయినా న‌చ్చిన బీచ్‌ల‌లో విహ‌రించ‌డం మాత్రం రాయ్ ల‌క్ష్మి మాన‌దు. నిత్యం ఎక్క‌డొ ఒక బీచ్‌లో బికినీలో ద‌ర్శ‌నిమిచ్చే రాయ్ ల‌క్ష్మికి క‌రోనా పెద్ద బ్రేకే ఇచ్చింది. దీంతో చాలా బోర్ ఫీల‌వుతోంద‌ట‌. నిత్యం ట్రావెట్ చేయ‌డం ఇష్ట‌ప‌డే రాయ్‌ల‌క్ష్మి త‌న ట్రావెల్ డేస్‌ని మిస్స‌వుతున్నాన‌ని, ఇంటి ప‌ట్టునే వుండ‌టం బోర్‌గా వుంద‌ని ఫీల‌వుతోంది.

ఐమ్ సాంగుల్లో హాట్ హాట్‌గా క‌నిపించి కుర్ర‌కారుకి కిర్రెక్కించిన ఈ హాట్ లేడీ గ‌త కొంత కాలంగా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా రాణించాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. `కాంచ‌న‌మాల కేబుల్ టీవి`తో తెలుగులో ప‌రిచ‌య‌మైన రాయ్ ల‌క్ష్మీ తెలుగు చిత్రాల్లో మిన‌హాయిస్తే త‌మిళంలో అత్య‌ధిక శాతం హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టించింది.

తాజాగా `సిండ్రెల్లా` పేరుతో రూపొందుతున్న హార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా వుంటే తాజాగా రాయ్ ల‌క్ష్మి సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో ఓ ఫొటోని పోస్ట్ చేసింది. ఎప్పుడూ సెక్సీగా క‌నిపించే రాయ్ లక్ష్మి ఆ ఫొటోలో పీక్కుపోయిన క‌నిపించ‌డంతో నెటిజ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు. లాక్ డౌన్ వేళ తిన‌డం లేదా? అంటూ కామెంట్ చేస్తున్నారు. `జూలీ` చిత్రం కోసం జీరో సైజ్‌కి మారి షాకిచ్చిన రాయ్ ల‌క్ష్మి తాజాగా అంత‌కు మించి త‌గ్గ‌డం ఆమె ఫ్యాన్స్‌కి షాకిస్తోంది. ఉన్న‌ట్టుండి రాయ్ ల‌క్ష్మికి ఏమైంది అంటూ ఆరాతీస్తున్నారు.