విడుదలకు సిద్ధం అవుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’

అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తుండగా ఈ సినిమాలో అనుష్క మూగ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ క్రమంలో సినిమా డిసెంబర్ లేదా జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది.