నటి కియారతో న్యూజిలాండ్ వెళ్లిన రాంచరణ్… 20 రోజులు న్యూజిలాండ్ లో షూటింగ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈయన ద్విపాత్రాభినయంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. దిల్ రాజు నిర్మాణంలో RC15 టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం న్యూజిలాండ్ వెళ్తున్నట్టు సమాచారం. ఈనెల 20వ తేదీ న్యూజిలాండ్ వెళ్లిన టీం 20 రోజుల పాటు అక్కడే షూటింగ్ పనులను జరుపుకొనున్నారట. న్యూజిలాండ్ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించడమే కాకుండా కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోని 20 రోజులపాటు చిత్ర బృందం న్యూజిలాండ్ లో సందడి చేయనున్నారు.

ఇకపోతే శంకర్ ఒకవైపు భారతీయుడు 2సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ పలువురు దర్శకుల సినిమాలలో నటించబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈయన తన తదుపరి సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే సుకుమార్ రామ్ చరణ్ ఎంట్రీ సీన్ షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.