ఆస్పత్రి పాలైన యంగ్ హీరో నాగ శౌర్య.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగశౌర్య చిన్నపాటి అస్వస్థకు గురయ్యారు. ఈయన చిన్నపాటి అస్వస్థతకు గురికావడంతో సినిమా షూటింగ్ లొకేషన్ లోనే సొమ్మసిల్లి పడిపోయారు.ఇకపోతే చిత్ర బృందం వెంటనే ఈయనను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అయితే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం గత మూడు రోజులుగా డైట్ ఫాలో అవుతూ ఏ విధమైనటువంటి ఫుడ్ వాటర్ తీసుకోకుండా ఉండటం వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది.

ప్రస్తుతం సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సన్నివేశాల కోసం ఈయన డైట్ ఫాలో కావడం వల్ల డిహైడ్రేషన్ కి గురయ్యారని ఇలా డిహైడ్రేషన్ కారణంగానే కళ్ళు తిరిగి సొమ్ము సిల్లి పడిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు కాస్త ఆందోళన చెందారు.

ఇకపోతే నాగశౌర్య ఈ నెల బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహానికి వారం రోజులు గడువు ఉన్నప్పటికీ నాగశౌర్య ఇంకా సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయనకు చిన్న అస్వస్థత చేయడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. నాగ శౌర్య పెళ్లి వరకు సినిమాల్లో నటించారని పెళ్లి వరకు సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఇక ఈయన వివాహం ఈనెల 20వ తేదీ ఎంతో ఘనంగా జరగనుంది.