విజ‌య్‌కు ఓటేసిన ఆలియా… ఎందుకంటే?

క్రేజీ స్టార్ విజ‌య్‌దేవ‌ర‌కొండ పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మయ్యాడు. అర్జున్‌రెడ్డితో క్రేజ్‌ని సంపాదించి గీత‌గోవిందంతో ఒక రేంజ్‌కి వెళ్ళిపోయాడు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆ క్రేజ్‌ను అలాగే కంటిన్యూ చెయ్యాల‌నుకుంటున్నాడు. తాజాగా ఓ బాలీవుడ్‌ అందాల భామ.. 2019లో తన ఫేవరేట్ హీరో ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా బాలీవుడ్‌ హీరోలను పక్కన పెట్టి విజయ్‌ దేవరకొండకు ఓటు వేసింది.

ఇటీవల ముంబైలో జరిగిన ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో బాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మలను నిర్వాహకులు ఈ ఏడాది మీ ఫేవరెట్ స్టార్స్‌ ఎవరంటూ ప్రశ్నించారు. ఇదే ప్రశ్న క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ ఏ మాత్రం తడుము కోకుండా తన ఫేవరెట్‌ హీరో విజయ్‌ దేవరకొండ అంటూ చెప్పేసింది. `నాకు మాత్రం విజయ్‌ దేవరకొండ మోస్ట్ గ్లామరస్‌ యాక్టర్‌` అంటూ చెప్పి బాలీవుడ్ జనాలకు కూడా షాక్‌ ఇచ్చింది అలియా. హీరోయిన్‌గా అనుష్క శర్మకు ఓటు వేసింది ఈ భామ.

బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా చేయకపోయినా అర్జున్‌ రెడ్డి చిత్రంతో బాలీవుడ్‌లోనూ మోస్ట్ ఫేవరెట్‌గా మారిపోయాడు రౌడీ హీరో. అందుకే ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్‌ అనుపమా చోప్రా నిర్వహించిన సినీ తారల రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌కు తెలుగు ఇండస్ట్రీ తరుపున విజయ్‌ దేవరకొండ హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో అలియా కూడా పాల్గొంది.

ఇప్పటికే అర్జున్‌ రెడ్డిగా బాలీవుడ్‌కు కూడా సుపరిచితుడైన విజయ్‌ దేవరకొండ త్వరలో అక్కడ హీరోగా ఎంట్రీకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అఫీషియల్‌గా బాలీవుడ్‌ ఎంట్రీపై విజయ్‌ కన్‌ఫర్మ్‌ చేయకపోయినా విజయ్‌ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు బాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు స‌మాచారం. ఈ లిస్ట్‌లో ముందుగా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ కరణ్‌ జోహార్‌ లాంటి కూడా ఉన్నారంటే విజయ్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక‌పోతే విజ‌య్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రం బిజీలో ఉన్నాడు.